Pandugappa Fish: చేపలకు రారాజు ఈ ‘జలపుష్పం’.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్‌

Pandugappa Fish: చేపల్లోనే రారాజు పండుగప్పకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఏర్పడటంతో పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా తీర ప్రాంతంలో రైతులు..

Pandugappa Fish: చేపలకు రారాజు ఈ 'జలపుష్పం'.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్‌
Follow us
Subhash Goud

|

Updated on: Feb 22, 2022 | 3:47 PM

Pandugappa Fish: చేపల్లోనే రారాజు పండుగప్పకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఏర్పడటంతో పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా తీర ప్రాంతంలో రైతులు పండుగప్పలను పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పండుగప్ప చేప సాగు తీర ప్రాంతంలో బాగా విస్తరిస్తోంది. రెండేళ్లుగా కరోనాతో చేపల సాగు అంతంతమాత్రంగానే ఉంది. కానీ, గత రెండు నెలల నుంచి చేపల ధర పెరిగింది. దాంతో ఆక్వా రైతులు పండుగప్ప చేపల పెంపకం (Fish Farming )పై ఆసక్తి చూపుతున్నారు. సముద్రం, ఉప్పు నీటిలో దొరికే ఈ చేప్పలను జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం, భీమవరం, కాళ్ల మండలాల్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సముద్రం, ఉప్పుటేరు తీర ప్రాంతాల్లో సుమారు ఐదు వేల ఎకరాల్లో పండుగప్పను సాగుచేస్తున్నారు. మంచి ప్రోటీన్స్ ఉన్న పండుగప్ప చేపను తినేందుకు నాన్ వెజ్ ప్రియులు ఎగబడతారు.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పండుగప్ప ధరలు ఆశాజనకంగా పెరిగాయి. కిలో నుంచి రెండు కిలోలలోపు ఉన్న చేప రూ. 320, రెండు నుంచి ఐదు కిలోలలోపు ఉంటే రూ.380, ఐదు నుంచి ఏడు కిలో లలోపు ఉంటే రూ.420, ఏడు కిలోలు దాటితే డిమాండ్ మరింత బాగుంది. పండుగప్ప బతికున్న చేపలను మాత్రమే ఆహారంగా తీసుకోవడం దీని ప్రత్యేకత. దీంతో రైతులు చెరువుల్లో బెత్తులు, చైనా గొరకలు వంటి చిన్నపాటి చేపలను ఆహారంగా వేస్తున్నారు. వీటిని పెంచేందుకు లోతు ఎక్కువగా ఉన్న ఎకరా చెరువులో 500 నుంచి 700 వరకు పిల్లలను వదులుతారు. వీటిని చెరువులో ఏడాది పాటు పెంచితే పది కిలోల వరకు బరువు వచ్చే అవకాశం ఉంటుంది.

ఎకరా రెండెకరాల్లో రొయ్యలు సాగు చేసే ఆక్వా రైతులు ప్రస్తుతం మూడు నుంచి నాలుగు ఎకరాల్లో పండుగప్పను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడులు పోను రాబడి బాగుంటుందని రైతులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో పండుగప్ప ధర కిలో రూ. 480 చొప్పున పలుకుతోంది. జిల్లాలో పండిన చేపలను హౌరా, ముంబై, గోవా, కోల్‌కతా, బీహార్ ప్రాంతాలతో పాటు విదేశాలకు పండుగప్ప ఎగుమతి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Battery Swapping Stations: హైదరాబాద్‌ ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్స్‌

Tourist Places : భారతదేశంలో రాత్రిపూట మరింత అందంగా కనిపించే ప్రదేశాలు ఇవే