AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tourist Places : భారతదేశంలో రాత్రిపూట మరింత అందంగా కనిపించే ప్రదేశాలు ఇవే

Tourist Places: మన దేశం పర్యాటక (Tourist) రంగానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. భారతదేశం అనేక విధాలుగా పర్యాటకులను ఆకర్షిస్తుంది . ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు..

Tourist Places : భారతదేశంలో రాత్రిపూట మరింత అందంగా కనిపించే ప్రదేశాలు ఇవే
Subhash Goud
|

Updated on: Feb 22, 2022 | 2:21 PM

Share

Tourist Places: మన దేశం పర్యాటక (Tourist) రంగానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. భారతదేశం అనేక విధాలుగా పర్యాటకులను ఆకర్షిస్తుంది . ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో మీకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించే అనేక గొప్ప ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలకు భారతదేశం (India) నుండి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు. అయితే చీకటి పడిన తర్వాత ప్రయాణం చేయాలనుకుంటే చీకటిలో చాలా అందంగా కనిపించే ప్రదేశాలను చూడాలనుకుంటే, భారతదేశంలోని ఈ ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

గోల్డెన్ టెంపుల్, అమృత్సర్

గోల్డెన్ టెంపుల్ అందాలను చూసేందుకు రాత్రిపూట మించిన సమయం లేదు. ఇది భారతదేశంలోని అత్యంత అందమైన కట్టడాలలో ఒకటి. సూర్యాస్తమయం తర్వాత మరింత అందంగా కనిపిస్తుంది.

అంబా విలాస్ ప్యాలెస్, మైసూర్

మైసూర్‌ను సందర్శించేటప్పుడు మైసూర్ ప్యాలెస్‌ను తప్పకుండా సందర్శించండి. ఇది చీకటిలో మెరుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 100,000 కంటే ఎక్కువ లైట్లలో వెలిగిపోతుంది. అందుకే చీకట్లో చూడదగ్గ అందమైన ప్రదేశాలలో ఇదొకటి. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం.

తాజ్‌మహల్, ఆగ్రా

తాజ్‌మహల్‌ అందం ఇప్పటికీ ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుంది. రాత్రి చంద్రుని కాంతిలో, ఈ పాలరాతి సమాధి అందం మరింత పెరుగుతుంది. దీని అందం ఎవరినైనా మంత్రముగ్దులను చేస్తుంది.

హర్ కి పౌరి, హరిద్వార్

హరిద్వార్, రిషికేశ్ వెళ్లే వారికి హర్ కీ పౌరి ప్రధాన ఆకర్షణ. రాత్రిపూట దీపాలు వెలిగించడం, గంగా హారతి ఈ ప్రదేశం అందాన్ని మరింత పెంచుతాయి.

విక్టోరియా మెమోరియల్, కోల్‌కతా

కోల్‌కతాను సిటీ ఆఫ్ జాయ్ అని కూడా అంటారు. విక్టోరియా మెమోరియల్ కోల్‌కతాలోని చాలా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. పచ్చని పచ్చిక బయళ్ల మధ్య ఉన్న ఈ పాలరాతి స్మారకం చాలా అందంగా ఉంది. ఈ ప్రదేశం పగటిపూట చాలా అందంగా కనిపించినప్పటికీ, రాత్రిపూట దీని అందం మరింత పెరుగుతుంది.

మెరైన్ డ్రైవ్, ముంబై

మెరైన్ డ్రైవ్‌ను క్వీన్స్ నెక్లెస్ అని కూడా అంటారు. ప్రజలు తరచుగా రాత్రిపూట ఇక్కడ తిరగడానికి ఇష్టపడతారు. ఈ ప్రదేశం రాత్రిపూట చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. మీరు ముంబయికి వెళ్లాలనుకుంటే తప్పకుండా ఇక్కడికి వెళ్లండి.

ఇవి కూడా చదవండి:

IRCTC Coorg Tour: కూర్గ్‌ అందాలను చూడాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలివే..

IRCTC: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ సేవల కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చిన భారతీయ రైల్వే..