AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palnati Veeraradhanotsavalu: పల్నాటి వీరారాధనోత్సవాలు.. నాలుగు రోజు ఉత్కంఠ భరితంగా కోడి పోరు..

Rooster Fights in Palnati Veeraradhanotsavalu: పల్నాడు వీరారాధనోత్సవాలు ఉత్సాహాభరితంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే వీరారాధన ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజు

Palnati Veeraradhanotsavalu: పల్నాటి వీరారాధనోత్సవాలు.. నాలుగు రోజు ఉత్కంఠ భరితంగా కోడి పోరు..
Palnati Veeraradhanotsavalu
Shaik Madar Saheb
|

Updated on: Dec 07, 2021 | 8:23 AM

Share

Rooster Fights in Palnati Veeraradhanotsavalu: పల్నాడు వీరారాధనోత్సవాలు ఉత్సాహాభరితంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే వీరారాధన ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజు కోడిపోరు ఉత్కంఠభరితంగా జరిగింది. మహాభారత యుద్ధం జూదం కారణంగా జరిగితే పల్నాడు యుద్దానికి కోడిపోరే కారణం.. మాచర్ల, గురజాల రాజ్యాల మధ్య జరిగిన కోడిపందెంలో ఓడిపోయిన బ్రహ్మనాయుడు తమ రాజుతో అరణ్య వాసం చేయడం ఆ తర్వాత మాచర్ల రాజ్యం ఇవ్వడానికి నాగమ్మ ఒప్పుకోకపోవటంతో పల్నాటి యుద్దం జరిగింది. ఈ యుద్దాన్ని గుర్తు చేసుకుంటూనే పల్నాటి వీరారాధనోత్సవాలు జరుపుకుంటారు. సాంప్రదాయ ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు కోడిపోరు నిర్వహిస్తారు. మాచర్ల, గురజాల రాజ్యాలకు బదులుగా ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు హాజరవుతారు.

మాచర్ల నుండి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరుకాగా గురజాల నుండి ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి హాజరయ్యారు. ఇద్దరు నేతలు తమ తమ కోళ్ళతో బరిలోకి దిగారు. ఈ ఉత్సవాన్ని కొణతాలు ధరించిన వీరాచారవంతులు ఆసక్తిగా తిలకించారు. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో చివరి రోజు కళ్ళిపాడు నిర్వహిస్తారు. దీంతో వీరారాధనోత్సవాలు ముగుస్తాయి. వివిధ ప్రాంతాల నుండి కారంపూడి చేరుకున్న వీరాచారవంతులు తమతమ కొణతముల పెట్టేలతో తిరుగు ప్రయాణమవుతారు.

Rooster Fights In Palnati V

Rooster Fights In Palnati V

Also Read:

Viral Video: ముందు సింహంలా గర్జించింది.. తీరా రింగులోకి దిగి గజగజ వణికింది.. ఫన్నీ వీడియో

Shocking Video: వామ్మో.. డేగ ‘వేట’ మాములుగా లేదుగా.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! వైరలవుతోన్న వీడియో