West Godavari: ‘పశ్చిమ’లో ఫ్యాక్షన్ సంస్కృతి.. అరటితోటపై కుళ్లు కత్తి.. 4 ఎకరాలు ధ్వంసం
కోపం వస్తే ఒక దెబ్బ కొడతారు.. ఒక మాట అంటారు. గొడవలు జరిగితే కూర్చుని మాట్లాడుకోవటానికి పలు ప్రయత్నాలు చేస్తారు.
కోపం వస్తే ఒక దెబ్బ కొడతారు.. ఒక మాట అంటారు. గొడవలు జరిగితే కూర్చుని మాట్లాడుకోవటానికి పలు ప్రయత్నాలు చేస్తారు. అయితే కుళ్లు , కుట్ర, కుతంత్రాలు మనిషి మనసులో మొదలైన పర్యావసానం విలువల పతనానికి దారి తీస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ తాజాగా ఓ దారుణ ఘటన జరిగింది. నల్లజర్ల మండలం కొత్తగూడెం గ్రామంలో దారుణం వెలుగు చూసింది. 4 ఎకరాల అరటి తోటను ఎవరో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన వెలుగు చూసింది. ఘటనపై బాధిత రైతు నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ద్వారకాతిరుమల మండలం మాలసానికుంటకు చెందిన ప్రభాకర్ రాజు అనే రైతు… నల్లజర్ల మండలం కొత్తగూడెం గ్రామంలో 4 ఎకరాలు పొలంలో కౌలు వ్యవసాయం చేస్తున్నారు. ఆ పొలంలో అరటి సాగు చేస్తున్నారు. అయితే సోమవారం రైతు పొలంలోకి వెళ్లి చూసేసరికే అరటి మొక్కలు ధ్వంసం చేసి ఉన్నాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఉంటారని స్థానిక రైతులు భావిస్తున్నారు. ఈ ఘటనపై రైతు ప్రభాకర్ రాజు నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక సుమారు ఆరు లక్షల వరకు పంట నష్టం వాటిల్లిందని, అప్పు చేసి మరి అరటి తోటపై పెట్టుబడి పెట్టామని, తనని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. స్థానికంగా అరటి తోటల ధ్వంసం కలకలం రేపింది. ఇలాంటి పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Also Read: Naga Chaitanya-Samantha: నెట్టింట తెగ వైరల్ అవుతోన్న చైతన్య, సమంతల ఓల్డ్ ఫోన్ కాల్…
వాతావరణం కంటే వేగంగా మారుతోన్న టమాట ధర.. మరోసారి మోత పుట్టిస్తోంది