Oxygen Shortage In Tirupati Ruia: తిరుపతి రుయాలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం.. విషమంగా 13 మంది పరిస్థితి.?
Oxygen Shortage In Tirupati Ruia: కరోనా మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారిలో ఎక్కువ శాతం ఆక్సిజన్ అందకే మరణిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు...
Oxygen Shortage In Tirupati Ruia: కరోనా మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారిలో ఎక్కువ శాతం ఆక్సిజన్ అందకే మరణిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటన తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో జరిగినట్లు తెలుస్తోంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో కరోనాతో పోరాడుతున్న రోగులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. సమయానికి ఆక్సిజన్ అందకపోవడంతో పలువురు రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో కరోనా రోగుల బంధువులు ఆసుపత్రిలో హడావుడి సృష్టించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఆక్సిజన్ సరఫరాను పునరుద్దరించడానికి వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందుకోసం సీపీఆర్‌ను చేస్తున్నారు. ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించేందుకు సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Marine animals: ఎప్పుడో 273 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిన సముద్రజీవులు తాజాగా ఉనికిలో..
Corona Test: తేనె టీగలతో నిమిషాల వ్యవధిలోనే కోవిడ్ పరీక్షల ఫలితాలు.. అదెలాగో మీరూ తెలుసుకోండి..