Oxygen: ఏపీకి ఒడిశా నుంచి ఆక్సిజన్..కార్గో విమానంలో అక్కడికి రెండు ఖాళీ టాంకర్లు పంపిన ప్రభుత్వం
Oxygen: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒడిశాలోని అంగూల్ నుంచి ఆక్సిజన్ దిగుమతి కానుంది. దీనికోసం ఏపీ ప్రభుత్వం రెండు ఖాళీ టాంకర్లను కార్గో విమానంలో భువనేశ్వర్‌కు పంపించింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ–17 విమానం గన్నవరం నుంచి శనివారం భువనేశ్వర్ బయలుదేరి వెళ్ళింది. ఈ ఏర్పాట్లను రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించిందని తెలిపారు. ఇప్పుసు భువనేశ్వర్ పంపించిన […]
Oxygen: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒడిశాలోని అంగూల్ నుంచి ఆక్సిజన్ దిగుమతి కానుంది. దీనికోసం ఏపీ ప్రభుత్వం రెండు ఖాళీ టాంకర్లను కార్గో విమానంలో భువనేశ్వర్‌కు పంపించింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ–17 విమానం గన్నవరం నుంచి శనివారం భువనేశ్వర్ బయలుదేరి వెళ్ళింది. ఈ ఏర్పాట్లను రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించిందని తెలిపారు. ఇప్పుసు భువనేశ్వర్ పంపించిన రెండు టాంకర్ల కెపాసిటీ 46 మెట్రిక్ టన్నులని ఆయన వివరించారు. అదేవిధగా చెన్నై, బళ్ళారిల నుంచి కూడా ఆక్సిజన్ సమకూర్చుకున్తున్నట్టు వెల్లడించారు. రోజుకు రెండు లేదా నాలుగు టాంకర్లను విమానంలో పంపి ఆక్సిజన్ తీసుకువచ్చే ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. ఒడిశాలో నింపిన ఆక్సిజన్ ట్యాంకర్లను తిరిగి రాష్ట్రానికి గ్రీన్ చానల్ ద్వారా తీసుకువస్తామన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి షన్‌మోహన్‌తోపాటు ఎయిర్‌పోర్టు అథారిటీ డైరెక్టర్ జి.మధుసూదనరావు, ఆపరేషన్ మేనేజర్ అంకిత్ జైస్వాల్ పాల్గొన్నారు.
ఒడిశా నుంచి 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్..
ఒడిశాలోని అంగూల్ నుంచి రాష్ట్రానికి 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను విమానాల ద్వారా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో దాదాపు 25 శాతం మేర మెడికల్ ఆక్సిజన్ వృథా అవుతున్నట్లు తెలిసిందని చెప్పారు. ఈ వ్రుదాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆక్సిజన్ పైపుల మరమ్మతులకు రూ.30 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామనీ, వీటి వల్ల కోవిడ్ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఫీజుల విషయంలో ఉల్లంఘనకు పాల్పడిన ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.