Tirupati By Election Results 2021: ఏకపక్షంగా సాగుతున్న తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్.. దూసుకుపోతున్న వైసీపీ..
Tirupati Assembly By Election Results 2021 LIVE Counting and Updates: తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతోంది.
Tirupati By Election Results 2021: ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతోంది. కడపటి వార్తలు అందేసరికి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 78,799 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ 57.22 శాతం ఓట్లు వైసీపీ సాధించింది.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభం అయింది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజ కవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకే గవర్న మెంట్ మహిళా కళాశాలలో జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన దగ్గర నుంచీ వైసీపీ అధిక్యంలోనే కొనసాగుతోంది. 78,799 ఓట్ల భారీ ఆధిక్యం సాధించిన వైసీపీ.. తొమ్మది రౌండ్ల లెక్కింపు పూర్యయ్యేసరికి వైసీపీ 78,799 ఓట్ల ఆధిక్యం సాధించింది.
ఇప్పటివరకూ వైసీపీ కి 1,80,859 ఓట్లు రాగా, టీడీపీకి 1,02,068, బీజేపీకి 17,748 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 2,814 ఓట్లు వచ్చాయి.
Also Read: Tirupati By Election Results 2021 LIVE: తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు.. కొనసాగుతోన్న వైసీపీ హావా.!