Honest Auto driver: నడిరోడ్డుపై ఆటో డ్రైవర్‌కు దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే నిండా బంగారం.. కట్ చేస్తే ఏం జరిగిందో తెలుసా..
ఒంగోలుకు చెందిన 26 ఏళ్ళ యువకుడు కట్టా సుబ్బయ్య ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు... ఏపి 27 JX 2758 నెంబర్ గల ఆటోను నడుపుతూ రాత్రి 11 గంటల సమయంలో ఒంగోలులోని సోనో విజన్ షో రూమ్ వద్దకు వచ్చేసరికి షో రూమ్ ఎదురుగా రోడ్డు మీద తనకు ఒక బ్యాగ్ కనిపించింది... ఆ బ్యాగ్‌లో నగలు ఉండటంతో కట్టా సుబ్బయ్య వెంటనే ఆ బ్యాగ్ ను ఒంగోలు ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చి అప్పగించాడు... పోలీసులు బ్యాగ్ ను ఓపెన్ చేసి అందులో

ప్రకాశం జిల్లా, అక్టోబర్ 05: ఒంగోలులో ఆటో డ్రైవర్ కట్టా సుబ్బయ్య ఎప్పటిలాగే అర్ధరాత్రి సవారీ కోసం రోడ్డుపై చక్కర్లు కొడుతున్నాడు. నగరంలోని రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎవరైనా ప్రయాణీకులు రాకపోతారా.. తనకు గిరాకీ దొరక్కపోతుందా.. ఆశతో ఆటోను నిదానంగా నడుపుతూ నగరంలోని అద్దంకి బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నాడు. సోనోవిజన్ షోరూమ్ దగ్గరకు రాగానే రోడ్డుపక్కన ఓ బ్యాగ్ కనిపించింది… వెంటనే ఆ బ్యాగ్‌ను తీసుకుని దాంట్లో ఏముందోనని వెతికాడు.. అంతే కళ్ళు జిగేల్ మన్నాయి. అందులో రూ. 8.50 లక్షల విలువైన 21 సవర్ల బంగారు నగలు కనిపించాయి. వెంటనే అటూ.. ఇటూ చూశాడు. ఎవరూ కనపడలేదు.
సాధారణంగా ఎవరికైనా ఇంత బంగారం రోడ్డుపై దొరికితే ఏం చేస్తారు. చటుక్కున చంకన పెట్టుకుని పారిపోతారు. అయితే ఆటో డ్రైవర్ కట్టా సుబ్బయ్య అలా చేయలేదు. ఆ బ్యాగ్‌లోని నగలు ఎవరో మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తికి చెందినదిగా భావించాడు. నగల బ్యాగ్‌ను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి తనకు బ్యాగ్ దొరికిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. ముందు పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని ఆటో డ్రైవర్ నిజాయితీని మెచ్చుకున్నారు పోలీసులు.
దొరికి బంగారు నగలను..
ఒంగోలుకు చెందిన 26 ఏళ్ళ యువకుడు కట్టా సుబ్బయ్య ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు… ఏపి 27 JX 2758 నెంబర్ గల ఆటోను నడుపుతూ రాత్రి 11 గంటల సమయంలో ఒంగోలులోని సోనో విజన్ షో రూమ్ వద్దకు వచ్చేసరికి షో రూమ్ ఎదురుగా రోడ్డు మీద తనకు ఒక బ్యాగ్ కనిపించింది… ఆ బ్యాగ్‌లో నగలు ఉండటంతో కట్టా సుబ్బయ్య వెంటనే ఆ బ్యాగ్ ను ఒంగోలు ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చి అప్పగించాడు… పోలీసులు బ్యాగ్ ను ఓపెన్ చేసి అందులో 21 సవర్ల బంగారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు…
వాటి విలువ రూ. 8.50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు… ఆ బ్యాగ్ ఎవరిదని విచారించడంతో ఒంగోలు మండలం కరవది గ్రామానికి చెందిన పొట్టేళ్ళ భాస్కరరావు చెందినదిగా పోలీసులు గుర్తించారు. దీంతో భాస్కరరావుకు సమాచారం ఇచ్చి పిలిపించారు. హైదరాబాద్‌లో ఉన్న వారి కూతురి దగ్గరకు వెళ్లేందుకు ఒంగోలు వచ్చి బస్సు ఎక్కే క్రమంలో బ్యాగ్ మరచిపోయినట్లు భాస్కరరావు పోలీసులకు తెలిపాడు. అనంతరం ఆ బ్యాగ్‌లో ఉన్న నగల వివరాలను భాస్కరరావు చెప్పిన వివరాలతో పోల్చుకుని బ్యాగ్ అతనిదేనని నిర్ధారించుకున్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మలికగార్గ్ సమక్షంలో 21 సవర్ల బంగారు నగలను పోలీసులు భాస్కర్‌రావుకు అప్పగించారు. విలువైన బంగారు ఆభరణాలతో దొరికిన బ్యాగ్ ను ఎంతో నిజాయితీగా పోలీసులకు అప్పగించి తన ఔనత్యం చాటుకున్న ఆటో డ్రైవర్ సుబ్బయ్యను జిల్లా ఎస్‌పీ ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా క్యాష్ రివార్డును అందించారు ఎస్పీ మలికగార్గ్.
తక్కువ సమయంలో వివరాలు కనిపెట్టి బంగారం ఉన్న బ్యాగును తమకు తిరిగి అప్పగించిన పోలీసులకు, ఆటోడ్రైవర్ సుబ్బయ్యను భాస్కర్‌రావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. బాదితుల పూర్తి వివరాలు కనిపెట్టి తిరిగి వారికి బ్యాగును అప్పజెప్పిన ఒంగోలు డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, ఒంగోలు టూ టౌన్ CI జగదీష్, ఒంగోలు వన్ టౌన్ ఎస్సై సంపత్ కుమార్, సిబ్బందిని జిల్లా ఎస్‌పి అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం