Ghantasala: అమర గాయకుడికి అపూర్వ వైభవం.. ఘంటసాల విగ్రహావిష్కరణకు ముస్తాబైన అమలాపురం..
అమరగాయకుడు, గాన గంధర్వుడు ఘంటసాల విగ్రహావిష్కరణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు (డిసెంబర్ 4) న ఘంటసాల శతజయంతిని పురస్కరించుకుని అమలాపురంలో విగ్రహావిష్కరణ...

అమరగాయకుడు, గాన గంధర్వుడు ఘంటసాల విగ్రహావిష్కరణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు (డిసెంబర్ 4) న ఘంటసాల శతజయంతిని పురస్కరించుకుని అమలాపురంలో విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని కొత్తపేటలో శిల్పి వడయార్ రూపుదిద్దారు. ఘంటసాల పాటలు వింటూనే ఘంటసాల విగ్రహం తయారు చేశానని శిల్ప వడయార్ చెబుతుండటం విశేషం. ఆదివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎర్రవంతెన వద్ద ఎన్టీఆర్ మార్గ్ లో ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణకు నటుడు ఎల్ బి శ్రీరామ్ హాజరుకానున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘంటసాల శత జయంతిని పురస్కరించుకుని జిల్లాలో మొట్టమొదటి సారిగా ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేశారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు 1922 డిసెంబర్ 4 న జన్మించారు. తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. గంభీరమైన స్వరంతో, పట్రాయని సీతారామశాస్త్రి వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి సహాయపడ్డారు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరం నేపథ్య గాయకులలో ఒకరు. వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందింది. 1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశ్ అంతా మారుమోగింది. తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది.
1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని శేషశైలావాస శ్రీ వేంకటేశా పాటను తెరపైనకూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే. ఏనోట విన్నా అతను పాడిన పాటలే.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..