Andhra News: వార్నీ.. ఈ బుడ్డోడి ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. కళ్లు మూసుకొని మరీ..
రూబీ క్యూబ్‌ను నార్మల్‌గానే సాల్వ్ చేయడం చాలా కష్టం.. ఇక దానికి టైమింగ్ పెట్టి, పైగా కళ్లు మూసుకొని చేయమంట ఎవరైనా చేస్తారా?.. ఇంతకు అది సాధ్యం అవుతందా అంటే అవుననే అంటున్నాడో బుడ్డోడు.. జనాలు ఒక్కసైడ్ కలపడానికే నానా తంటాలు పడే రూబీ క్యూబ్‌ను ఈ బుడ్డో కేవలం 5నిమిషాల్లో కలిపేస్తాడు. అది కూడా కళ్లు మూసుకొని.. అదెలా అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే

క్యూబ్ సెట్ చేయడం అంటే మాములు విషయం కాదు.. దానికి ఎంతో ట్యాలెంట్ ఏకాగ్రత కావాలి.. సాదరణ జనాలు ఈ క్యూబ్‌ను వన్ సైడ్ సెట్ చేయడానినికే నానా తంటాలు పడుతారు. కానీ ఇక్కడ ఓ బుడ్డోడు మాత్రం కళ్ళు మూసుకుని మరి నిమిషాల్లో దాన్ని కలిపేస్తున్నాడు నెల్లూరుకు చెందిన నోమేష్ అనే బాలుడు. ఈ బుడ్డోడు కళ్లు మూసుకొని 5 నిమిషాల 24 సెకండ్లలో క్యూబ్‌ను సెట్ చేసి అందిరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ పిల్లాలని ప్రతిభను చూసి జిల్లా కలెక్టర్ సైతం నోమేష్‌ను ప్రశంసించాడు.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాకు చెందిన అనుముల నోమేష్ అనే ఈ 11 ఏళ్ల బాలుడు పట్టణంలోని బీవి నగర్ ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు.అయితే క్యూబ్ లను అమర్చడంలో నోమేష్‌కు ఏవరు సాటి లేరు. ఎందుకంటే మనోడు క్యూబ్ సెట్ చేస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఈ బుడ్డోడు కంటికి గంతలు కట్టుకొని క్యూబ్ లపై ఫోటోలను అమరుస్తూ హౌరా అనిపిస్తున్నాడు. తను చదువుతున్న పాఠశాలలో చిల్డ్రన్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 30 క్యూబ్ లతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫోటోను వచ్చేలా అమర్చి తన ప్రతిభను కనబరిచాడు.
కళ్లకు గంతలు కట్టుకొని 5 నిముషాల 24 సెకండ్లలో 30 క్యూబులతో బాలుడు చేసిన అపురూపమైన ఆ ప్రతిభ పాఠం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది చూసిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందనలతో ముంచేత్తారు.గతంలోనూ నోమేష్ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ పరివేక్షణలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను 16 క్యూబ్ లతో 13 నిమిషాల 8 సెకండ్లలో లో పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నాడు.
ఇలాంటి బాలుడు తమ పాఠశాలలో చదవడం గర్వకారణమని స్కూల్ కరస్పాండెంట్ మస్తాన్ తెలియజేశారు.ఇదే స్ఫూర్తితో మరెన్నో అద్భుతాలు సృష్టించాలని నోమేష్ కొనియాడారు. ఇలాంటి బాలుడు మరెన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నోమేష్ ను సత్కరించి అభినందనలు తెలియజేశారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
