Andhra: మంత్రి సిఫార్సు లెటర్లతో తిరుమల వెళ్తున్నారా.? ఓ సారి ఇది చెక్ చేసుకోండి.. లేదంటే.!
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ టీటీడీ లెటర్లు జారీ అవుతున్న విషయం బయటపడింది. టిటిడి సిఫార్సుల పేరుతో ఇటీవల నెల రోజులుగా మంత్రికి చెందిన నకిలీ లెటర్లు మార్కెట్లో చలామణి అవుతున్నాయని తేలింది. ఆ వివరాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ టీటీడీ లెటర్లు జారీ అవుతున్న విషయం బయటపడింది. టిటిడి సిఫార్సుల పేరుతో ఇటీవల నెల రోజులుగా మంత్రికి చెందిన నకిలీ లెటర్లు మార్కెట్లో చలామణి అవుతున్నాయని తేలింది. బాధితులు ఈ విషయం మంత్రి కార్యాలయ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే చర్యలు చేపట్టారు మంత్రి సత్య కుమార్. మంత్రి పీఏ స్వయంగా ఈ నకిలీ లెటర్ వ్యవహారంపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసి ఈరోజు ఫిర్యాదు చేశారు.
మంత్రి పేరుతో ఫేక్ లెటర్లు జారీ చేస్తున్న మోసగాళ్లను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో కమిషనర్ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖర్ బాబు ప్రజలను అప్రమత్తం చేశారు. టిటిడి పేరుతో ఎవరి దగ్గర నుంచైనా లెటర్లు పొందే ముందు అవి నిజమైనవా? కాదా అన్న సంగతి తెలుసుకోవాలని సూచించారు. నకిలీ లెటర్లు ఇచ్చి మోసగాళ్లు ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని, ఇలాంటి ప్రయత్నాలను ఎదుర్కునేందుకు ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు.
