AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉలిక్కపడ్డ అనకాపల్లి.. నగరంలో అనుమానంగా ఇద్దరు విదేశీయుల సంచారం.. కట్‌చేస్తే..

అనకాపల్లిలో తీవ్ర కలకలం రేగింది. అనుమాన్నాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాకినాడ నుంచి వెళ్తుండగా పట్టుకున్నారు. నిఘా వర్గాల కీలక సమాచారం ఇవ్వడంతో అనకాపల్లి పోలీసులు అలర్ట్ అయ్యారు. పట్టుబడిన వారిలో ఒక వ్యక్తి, బాలిక ఉన్నారు. బంగ్లాదేశ్ బోర్డర్ దాటి భారత్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. తీవ్ర కలకలం సృష్టించిన ఘటనతో అనకాపల్లి ఉలిక్కిపడింది.

ఉలిక్కపడ్డ అనకాపల్లి.. నగరంలో అనుమానంగా ఇద్దరు విదేశీయుల సంచారం.. కట్‌చేస్తే..
Andhra News
Maqdood Husain Khaja
| Edited By: Anand T|

Updated on: Nov 17, 2025 | 10:56 PM

Share

అనకాపల్లిలో తీవ్ర కలకలం రేగింది. అనుమాన్నాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాకినాడ నుంచి వెళ్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో ఓ వ్యక్తి, బాలిక ఉన్నారు. అనకాపల్లి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిఘా వర్గాల సమాచారంతో ఓ బాలిక, మరో వ్యక్తి అనకాపల్లి రైల్వే స్టేషన్ పాత బుకింగ్ కౌంటర్ వద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తి పేరు విక్రమ్ అలీ అలియాస్ మహమ్మద్ తయ్యబ్‌గా పోలీసులు గుర్తించారు. ఇతను 2012లో భారత్‌లోకి చొరబడ్డాడు. ఉత్తర ప్రదేశ్ అలీగడ్‌లో 10 ఏళ్లపాటు నివాసమున్నాడు. ఆ తర్వాత కాకినాడకు మకాం మార్చిన తయ్యాబ్.. మూడేళ్లుగా కాకినాడలోనే నివాసం ఉంటున్నాడు.

అయితే బంగ్లాదేశీ బాలికను పెళ్లి చేస్తానని నమ్మించి బోర్డర్ దాటించాడు తయ్యబ్. ఆ తరువాత ఆమెను తీసుకోచ్చి రెండు నెలలుగా కాకినాడలోని బంధించాడు. ఈ విషయం తెలుసుకున్న నిగా వర్గాలు ఇద్దరి కదలికలను గమనించారు. వారు కాకినాడ నుంచి అనకాపల్లి వరకు వచ్చినట్టు తెలుసుకొని అనాపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విక్రమ్ అలియాస్ తయ్యబ్ సహా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారించి అసలు విషయాన్ని తెలుసుకున్నారు.

తయ్యబ్ పై ఫోక్సో, ఫారినర్ యాక్ట్, పాస్పోర్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు అనకాపల్లి సిఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. అలాగే అతన్ని కోర్టులో హాజరుపర్చగా కోర్టు తయ్యబ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిందని తెలిపారు. బాలికను చిడ్రెన్స్ హోమ్‌కు తరలించామన్నారు. ఈ కేసులో మరికొంత సమాచారం సేకరించేందుకు నిందితుడిని కస్టడీకి తీసుకొనే అంశాన్ని పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. మొత్తం అదే చేసేస్తుంది!
ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. మొత్తం అదే చేసేస్తుంది!
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!