Hospital Aggression: నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం.. డబ్బులు కట్టలేదని కరోనా బాధితురాలికి ఆక్సిజన్ కట్..!

కరోనా టైమ్‌లో కార్పోరేట్ ఆసుపత్రులు అరాచకాలు పెరిగిపోతున్నాయి. పేషెంట్లను పీక్కు తింటున్నాయి ఆసుపత్రి వర్గాలు. లక్షల రూపాయలు వసూలు చేస్తూ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.

Hospital Aggression: నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం.. డబ్బులు కట్టలేదని కరోనా బాధితురాలికి ఆక్సిజన్ కట్..!
Nellore Anasuya Institute Of Medical Sciences Hospital
Follow us

|

Updated on: May 26, 2021 | 7:02 AM

Nellore AIMS hospital Aggression: కరోనా టైమ్‌లో కార్పోరేట్ ఆసుపత్రులు అరాచకాలు పెరిగిపోతున్నాయి. పేషంట్లను పీక్కు తింటున్నాయి ఆసుపత్రి వర్గాలు. లక్షల రూపాయలు వసూలు చేస్తూ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. తాజాగా నెల్లూరు నగరంలో ఓ ఆసుపత్రిలో కోవిడ్ బాధితురాలికి ఆక్సిజన్ ఆపేసిన అరాచకం బయటపడింది.

కోవిడ్ చికిత్సకు వసూలు చేయాల్సిన ఫీజులపై ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు ప్రకటించినా.. అవెక్కడా అమలు కావడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులు ఎంత చెబితే అంత కట్టాల్సిందే. వైరస్ బాధితుల నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్న కార్పోరేట్ ఆసుపత్రులు .. వైద్యం విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి.

నెల్లూరు నగరంలోని అనసూయ మెడికల్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్‌లో ఓ బాధితురాలికి ఆక్సిజన్ సరఫరాను నిలిపేశారు వైద్య సిబ్బంది. బాధితురాలిని చూసేందుకు వచ్చిన బంధువులను బయటకు గెంటేశారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు ప్రాంతానికి చెందిన స్వర్ణలత అనే మహిళకు పాజిటివ్ రావడంతో నగరంలోని హాస్పిటల్ లో చేర్పించారు. ఆమెకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా.. బెడ్లు ఖాళీ లేవని చెప్పి.. ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారు. బిల్లులు అడిగితే రెండు లక్షల రూపాయలకే బిల్లులు ఇచ్చారు.

అయితే, బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని ఫోన్ రావడంతో.. ఆసుపత్రికి వచ్చిన పేషంట్ బంధువులు షాక్ తిన్నారు. స్వర్ణలతకు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసిన ఆసుపత్రి సిబ్బంది.. ఆమెను చూసేందుకు బంధువులకు అనుమతి కూడా ఇవ్వలేదు. ఆసుపత్రి తీరుపై పేషంట్ బంధువులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. లక్షల రూపాయలు వసూలు చేసి కనీసం బిల్లులు కూడా ఇవ్వని అనసూయ మెడికల్ కాలేజ్ ఆఫ్‌ సెన్సెస్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. బాధితుల ఫిర్యాదుతో విజిలెన్స్ వర్గాలు ఆసుపత్రిపై విచారణ చేపట్టింది.

Read Also….  INTER ADMISSIONS: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫస్ట్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు