Andhra Pradesh: ఎమ్మెల్యే ఆనంకు వైసీపీ హైకమాండ్ షాక్.. వెంకటగిరి సమన్వయకర్తగా నేదురుమల్లి..
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి వైసిపి అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. వెంకటగిరి సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌ను నియమించారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి వైసిపి అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. వెంకటగిరి సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌ను నియమించారు. ఎమ్మెల్యే ఉండగానే సమన్వయకర్తను నియమించింది అధిష్టాం. ఇక వెంకటగిరిలోని నేదురుమల్లి ఇంటి దగ్గర కోలాహలం నెలకొంది. అయితే, ఈ సీన్ అంతా అరగంటలోనే నడిచింది. ప్రభుత్వంపై ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు చేయడం, ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, మాజీ మంత్రుల నుంచి రాయక్షన్ రావడం, వెంకటరిగి సమన్వయకర్తగా రామ్‌కుమార్‌ను నియమిస్తారని ప్రచారం జరగడం అరగంటలో జరిగిపోయింది. రామ్‌కుమార్ విషయంలో ప్రచారం జరుగుతుండగా.. ఆనం మీడియా ముందుకు వచ్చారు. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని ప్రెస్‌మీట్‌లో ప్రకటిస్తుండగానే.. మరోవైపు ఆయనను సస్పెండ్ చేస్తూ వైసీపీ నుంచి ప్రకటన వెలువడింది. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఆనం రామనారాయణ రెడ్డిని తప్పిస్తూ.. నేదురుమల్లి రామ్‌కుమార్ నియమిస్తూ ప్రకటన జారీ చేశారు.
కొన్నిరోజులుగా ప్రభుత్వం, పార్టీ పనితీరుపై రాంనారాయణ తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆయన్ను తప్పిస్తారంటూ ముందుగానే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారం నిజమైంది. కాగా, రామ్‌కుమార్‌కు పోస్ట్ రావడంతో వెంకటగిరి వైసీపీ అభ్యర్థిపై క్లారిటీ వచ్చింది. ఆయనకే వెంకటగిరి సీట్ కన్ఫామ్ అని అర్థమైంది. అయితే, రామ్‌కుమార్‌కు అవకాశం ఇస్తే ఆనం దారి ఎటు అన్న ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..