RRC Railway Jobs 2023: పదో తరగతి అర్హతతో రాత పరీక్షలేకుండా దక్షిణ మధ్య రైల్వేలో 4103 రైల్వే ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన దక్షిణ మధ్య రైల్వేలో 2022-23 సంవత్సరానికి సంబంధించి.. 4,103 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్..
భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన దక్షిణ మధ్య రైల్వేలో 2022-23 సంవత్సరానికి సంబంధించి.. 4,103 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏసీ మెకానిక్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్ తదితర విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు డిసెంబర్ 30, 2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 29, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ప్రతిఒక్కరూ రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. ఎటువంటి రాత పరీక్షలేకుండా విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నెలకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.