Draupadi Murmu: ఇవాళ ఏపీకి రానున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము..
Draupadi Murmu: మరో వారం రోజుల్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో క్యాంపెయినింగ్‌లో భాగంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము..
Draupadi Murmu: మరో వారం రోజుల్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో క్యాంపెయినింగ్‌లో భాగంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఆమెకు బీజేపీ నేతలు స్వాగతం పలుకనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ద్రౌపది ముర్ము వెళతారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు సీఎం జగన్ తేనీటి విందు ఇవ్వనున్నారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆమె భేటీ కానున్నారు. మంగళగిరిలోని ఓ ప్రైవేట్ పంక్షన్ హాల్‌లో ఈ భేటీ జరుగనుంది.
కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు డైరెక్ట్‌గా మద్దతు ప్రకటించింది వైసీపీ. మద్దతు ప్రకటించడమే కాదు, ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ ఎంపీలను పంపారు జగన్మోహన్‌రెడ్డి. ముర్ము నామినేషన్ ప్రోగ్రామ్‌కు అటెండైన వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి… ఆమె అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.
తనకు మద్దతు తెలిపినందుకు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పారు ద్రౌపది ముర్ము. ఇటీవలే, సీఎం జగన్‌కు ఫోన్‌చేసి మాట్లాడిన ద్రౌపది ముర్ము, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటికే, పలు రాష్ట్రాల్లో పర్యటించిన ముర్ము.. ఎన్డీఏ పక్షాలతోపాటు తనకు మద్దతిస్తోన్న పార్టీలను కలుస్తున్నారు. అందులో భాగంగానే నేడు ఏపీకి వస్తున్నారు ఆమె. తనకు సపోర్ట్ చేస్తోన్న వాళ్లకే కాదు, అపోజిషన్ లీడర్స్‌కు, తటస్థ పార్టీలకు కూడా ఫోన్‌చేసి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు ముర్ము. ఈనెల 18న బ్యాలెట్ పద్ధతిలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పోలింగ్ జరగనుంది. పార్లమెంట్‌తోపాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 21న ఓట్లు లెక్కించి, అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు.
ద్రౌపది తెలంగాణ పర్యటన రద్దు…
ఎన్డీయే(NDA) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలంగాణాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఆమె హైదరాబాద్ పర్యటన కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఓ వైపు రాష్ట్రంలో భారీ వర్షాలు.. మరోవైపు సమయాభావం వల్ల ద్రౌపది ముర్ము రాలేకపోతున్నారని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న ద్రౌపది ముర్ము బిజీబిజీగా ఉన్నారు.