TDP vs YCP: లోకేష్‌కు వెల్కమ్ చెబుతూ ఫ్లెక్సీల ఏర్పాటు.. చింపేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. దాడి చేసుకున్న వైసీపీ, టీడీపీ నేతలు
యువ గళం జెండాలు కట్టిన తెలుగు యువత కార్యకర్తలకు సంబంధించిన బైక్‌లపై దాడి చేశారు. బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘర్షణ చెలరేగింది.
ఆంధ్రప్రదేశ్ లో ఏడాదికి పైగా ఎన్నికలకు సమయం ఉన్నా.. ఎన్నికల వేడి మొదలైంది. అధికార ప్రతి పక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు కూడా తలెత్తుతున్నాయి. తాజాగా ప్లెక్సీలు చింపేశారని.. వైసీపీ, టీడీపీ నేతలు దాడులు చేసుకున్నారు. దీంతో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ – వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించేసి, కాల్చేశారు. అయితే ఇది వైసీపీ కార్యకర్తల పనే అంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.
యువ గళం జెండాలు కట్టిన తెలుగు యువత కార్యకర్తలకు సంబంధించిన బైక్‌లపై దాడి చేశారు. బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘర్షణ చెలరేగింది. వెంటనే అలెర్టయిన పోలీసులు.. కాల్చిన ఫ్లెక్సీని పీఎస్‌లోకి తీసుకెళ్లారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడ నుంచి పంపించారు. బైరెడ్డిపల్లిలో నిన్న లోకేష్ పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా.. స్థానిక టీడీపీ నేతలు బ్యానర్లు కట్టారు. వాటిని పీకేయడంతో.. గొడవ మొదలైంది. వైసీపీ కార్యకర్తలే ఈ పని చేశారని తెలిసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు టీడీపీ నేతలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..