‘లోకేష్ ఓ వేస్ట్ ఫెలో.. ఆ రెండిటికీ తేడాతెలీదు’ : కొడాలి

చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఓ వేస్ట్ ఫెలో అని ఘాటుగా విమర్శించారు ఏపీ మంత్రి కొడాలి నాని. నారా లోకేష్ కు వరి చేనుకి, చేపల చెరువుకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. లోకేష్ ఎంత తిరిగినా ఉపయోగం లేదన్న నాని.. అమరావతిలో భూములు కొన్నారు కాబట్టే టీడీపీ నేతలు హడావిడి చేస్తున్నారని విమర్శించారు. రైతులకు బేడీలు వేశారని తాను కూడా బేడీలు వేసుకున్న దేవినేని ఉమ.. బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు తనను తాను […]

  • Venkata Narayana
  • Publish Date - 3:33 pm, Fri, 30 October 20
'లోకేష్ ఓ వేస్ట్ ఫెలో.. ఆ రెండిటికీ తేడాతెలీదు' : కొడాలి

చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఓ వేస్ట్ ఫెలో అని ఘాటుగా విమర్శించారు ఏపీ మంత్రి కొడాలి నాని. నారా లోకేష్ కు వరి చేనుకి, చేపల చెరువుకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. లోకేష్ ఎంత తిరిగినా ఉపయోగం లేదన్న నాని.. అమరావతిలో భూములు కొన్నారు కాబట్టే టీడీపీ నేతలు హడావిడి చేస్తున్నారని విమర్శించారు. రైతులకు బేడీలు వేశారని తాను కూడా బేడీలు వేసుకున్న దేవినేని ఉమ.. బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు తనను తాను గన్‌తో కాల్చుకోవాలని కొడాలినాని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఎస్కార్ట్ సిబ్బందిపై ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వస్తున్న ఇబ్బందులకు టీడీపీకి చెందిన అప్పటి మంత్రి దేవినేని ఉమానే కారణమని కొడాలి నాని ఆరోపించారు.