AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Bhuvaneswari: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జనంలోకి భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ యాత్రకు శ్రీకారం..

Nara Bhuvaneswari starts Nijam Gelavali bus yatra : తెలుగుదేశం పార్టీ అధినేత.. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆయన భార్య భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. నారావారిపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నిజం గెలవాలి యాత్రకు భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి, టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ ఆమె వెంట ఉన్నారు.

Nara Bhuvaneswari: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జనంలోకి భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ యాత్రకు శ్రీకారం..
Nara Bhuvaneswari
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Oct 26, 2023 | 7:40 PM

Share

Nara Bhuvaneswari starts Nijam Gelavali bus yatra : తెలుగుదేశం పార్టీ అధినేత.. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆయన భార్య భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. నారావారిపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నిజం గెలవాలి యాత్రకు భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి, టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ ఆమె వెంట ఉన్నారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత.. భువనేశ్వరి చంద్రగిరికి బయలుదేరారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనోవేదనతో మృతి చెందిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. భువనేశ్వరి వెంట టీడీపీ నేతలు, ఇంఛార్జిలు ఉన్నారు.

ముందుగా.. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక నేండ్రగుంటలో గుండెపోటుతో మరణించిన చిన్నబ్బ కుటుంబ సభ్యులకు నారా భువనేశ్వరి పరామర్శించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా.. భువనేశ్వరి నారావారిపల్లెలో మహిళలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత అగరాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడనున్నారు. రేపు తిరుపతి, ఎల్లుండి శ్రీకాళహాస్తిలో నిర్వహించే సభల్లో భువనేశ్వరి పాల్గొంటారు.

Nijam Gelavali Bus Yatra

Nijam Gelavali Bus Yatra

చంద్రబాబు అరెస్టు విషయం విని ప్రాణాలు కోల్పోయిన అభిమానులు, కార్యకర్తల కుటుంబాలను ఆమె ఈ యాత్రలో కలుస్తారు. వారానికి మూడు రోజుల పాటు బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి భువనేశ్వరి పరామర్శించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..