Andhra Pradesh: లంచం కావాలని అడిగిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారి.. చివరికి ఊహించని ట్విస్ట్
Srikakulam News: లంచం తీసుకోవడం సమాజానికి ఓ పెనుభూతంగా తయారవుతోంది. అవినీతి నిరోధక శాఖ దాడులు జరుపుతున్నా.... చట్టాలు శిక్షలు విధిస్తున్న లంచగొండితనాన్ని మాత్రం రూపుమాపటం వీలుకావటం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి దురాగతాలు ఎక్కువగా జరుగుతుంటాయి. చివరికి పేదవానికి కూడా న్యాయం జరగలాన్నా, అతని సమస్యలు తీరాలన్న అధికారులకు లంచం ఇవ్వాల్సిందే.
శ్రీకాకులం, ఆగస్టు 1: లంచం తీసుకోవడం సమాజానికి ఓ పెనుభూతంగా తయారవుతోంది. అవినీతి నిరోధక శాఖ దాడులు జరుపుతున్నా…. చట్టాలు శిక్షలు విధిస్తున్న లంచగొండితనాన్ని మాత్రం రూపుమాపటం వీలుకావటం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి దురాగతాలు ఎక్కువగా జరుగుతుంటాయి. చివరికి పేదవానికి కూడా న్యాయం జరగలాన్నా, అతని సమస్యలు తీరాలన్న అధికారులకు లంచం ఇవ్వాల్సిందే. కొంతమందైతే తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు అప్పులు చేసి మరి లంచాలు ఇస్తున్న గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతున్నారు. అయినా కూడా ఈ అవినీతి మాత్రం ఆగడం లేదు. తాజాగా శ్రీకాకుళంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి అడ్డంగా బుక్ అయ్యాడు.
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఐ.గౌరీ శంకర్ రావు లంచం తీసుకుంటుండగా డీఎస్పీ రమణ మూర్తి అధ్వర్యంలో ఏసిబీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. శ్రీకాకుళం హడ్కో కాలానికి చెందిన తమ్మినేని పురుషోత్తం రావు అనే ఓ రిటైర్డ్ టీచర్ తనకున్న 293 గజాల ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలని భావించారు. అందుకోసం ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ లో వెకంట్ లాండ్ టాక్స్ బకాయి క్లియర్ చేయాల్సి ఉంది. దానికోసం నగరపాలక సంస్థ ఆర్.ఐ గౌరీ శంకర్ రావుని సంప్రదించారు పురుషోత్తం రావు. అయితే ఆ ప్రాసెస్ పూర్తి చేసేందుకు గౌరీ శంకర్ 20వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు.
లంచం ఇవ్వడం ఇష్టం లేని పురుషోత్తం రావు ACB అధికారులను సంప్రదించారు. దాంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నగరపాలక సంస్థ కార్యాలయంలోనే లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా గౌరీ శంకర్‌ని పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. బుధవారం గౌరీ శంకర్రావుని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని గౌరీ శంకర్ క్యాబిన్ లోనూ సోదాలు నిర్వహించారు. లంచం తీసుకోవడం నేరమని… ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 14400 కాల్ సెంటర్ నెంబర్కి ఫోన్ చేస్తే 48 గంటల సమయంలోనే చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..