Guntur: చదివేది ఇంటర్.. హైదరాబాద్‌లో యాంకర్.. ఫోన్ చెక్ చేస్తే బయటపడ్డ అసలు నిజం
గుంటూరు ఆర్టీసీ కాలనీలో తల్లి–కూతురి మధ్య డ్రగ్స్ వివాదం కలకలం రేపింది. కుమార్తె మాట వినడం లేదని మనస్తాపానికి గురైన తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కూతురు డ్రగ్స్‌కు బానిసైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూతురు మాత్రం ఇష్టం లేని పెళ్లి చేయిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మాయి, అమ్మ మధ్యలో డ్రగ్స్ వివాదాన్ని రేపాయి. కూతురు చెప్పిన మాట వినటం లేదని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడమే కాకుండా కూతురు డ్రగ్స్ బానిసైందని ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. కూతురు మాత్రం ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆరోపిస్తుంది. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు ఆర్టిసి కాలనీకి చెందిన స్వప్న,రాజేష్ దంపతులకి ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న కుమార్తె ఉంది. స్వప్న హైదరాబాద్‌లో యాంకర్‌గా పనిచేస్తుంది. అయితే కొన్ని రోజులుగా కుమార్తె ప్రవర్థన అనుమానాస్పదంగా ఉండటంతో ఆమెపై తల్లి దండ్రులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే కూతురికి కౌశిక్ అనే యువకుడితో పరిచయం ఉన్నట్లు తేలింది. ఇన్ స్టాలో పరిచయమైన కౌశిక్‌తో మైనర్ చనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఈక్రమంలోనే తమ కుమార్తెకు పెళ్లి చేసేందుకు సిద్దమయ్యారు. అయితే తల్లిదండ్రుల పెళ్లి చేసుకునేందుకు భూమిక ఇష్టపడలేదు. దీంతో శుక్రవారం రాత్రి భూమిక ఫోన్ తీసుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తె డ్రగ్స్‌కు బానిసైనట్లు గుర్తించారు. తప్పుడు మార్గంలో ప్రయాణిస్తుందని తనతో గొడవకు దిగారు. తల్లిదండ్రులను టీనేజర్ ఎదిరించి మాట్లాడటంతో తల్లి కుమార్తెను కొట్టింది. ఇద్దరి మధ్య వివాదం మధ్య వివాదం ముదరడంతో మనస్థాపానికి గురైన తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కుమార్తెను డ్రగ్స్ కు బానిస చేసి ఆమెతో చనువుగా ఉంటూ డ్రగ్స్ వినియోగిస్తున్న వీడియోస్ కూడా ఉన్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఈ పిర్యాదుపై పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న తల్లి స్వప్నను ఈగిల్ చీఫ్ ఆకే రవికృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరామర్శించారు. ఇద్దరి స్టేట్ మెంట్స్ తీసుకున్నామని కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. స్వప్న కుమార్తె డ్రగ్స్ తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం ఉన్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. కేసు పూర్తి స్తాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




