AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: బాహుబలి కాదు అంతకు మించి.. భారత్–అమెరికా సంయుక్తంగా చేపడుతున్న ప్రాజెక్ట్

సైకిల్‌పై రాకెట్ తీసుకెళ్లిన స్థాయి నుంచి… ప్రపంచ దేశాల భారీ ఉపగ్రహాలను నింగిలోకి చేర్చే స్థాయికి ఇస్రో ఎదిగింది. మరో నాలుగైదు రోజుల్లో శ్రీహరికోట నుంచి LVM-03 M6 ‘బాహుబలి’ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన 6.5 టన్నుల బ్లూబర్డ్-6 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. భారత్–అమెరికా సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రయోగం ఇస్రో సామర్థ్యానికి మరో మైలురాయిగా నిలవనుంది.

ISRO: బాహుబలి కాదు అంతకు మించి..  భారత్–అమెరికా సంయుక్తంగా చేపడుతున్న ప్రాజెక్ట్
Lvm 03 M6
Ch Murali
| Edited By: |

Updated on: Dec 13, 2025 | 7:21 PM

Share

ఇస్రో.. ఒకప్పుడు సైకిల్‌పై రాకెట్‌ను తీసుకెళ్లి ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్ష ప్రయోగాల్లో దిగ్గజాలు అయిన రష్యా, చైనా , అమెరికా లాంటి దేశాలు మనల్ని అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇపుడు అదే రష్యా, అమెరికా దేశాలకు ఇస్రో కీలక ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశ పెట్టే స్థాయికి చేరుకుంది.. ఐదేళ్ల క్రితం వరకు చిన్న చిన్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించే సామర్థ్యం ఉన్న ఇస్రో ఇపుడు అత్యంత భారీ ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే లెవల్ ఉన్న రాకెట్‌ను తయారు చేసింది.. మరో నాలుగైదు రోజుల్లో ఈ మెగా బాహుబలి రాకెట్ ప్రయోగం జరగనుంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్దమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి బ్లూబర్డ్‑6 ప్రయోగం జరగనుంది. ఈ ఉపగ్రహాన్ని LVM-03 M6 అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది బ్లూబర్డ్ శాటిలైట్. భారత్‑అమెరికా సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నాయి. ఇస్రో రాకెట్ ప్రయోగ తేదీని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ నెల 15 నుంచి 20 లోపు ప్రయోగం జరగనుంది. ఎల్‌వీఎమ్-3, M6 రాకెట్ ప్రయోగానికి చాలా ప్రత్యేకత ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (isro) వద్ద రెండు టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే నింగిలోకి ప్రవేశ పెట్టగలిగేది. అంతకంటే బరువైన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలంటే ఫ్రెంచ్, గయా, రష్యా లాంటి దేశాల సహకారంతో ఉపగ్రహాలను ప్రవేశపెట్టేది ఇస్రో.. ఇప్పుడు ఆ పరిస్థితులను అధిగమించింది.. LVM – 03 సరికొత్త వాహక నౌకను తయారు చేసింది.. 4 టన్నుల బరువు ఉన్న ఉపగ్రహాలను సైతం నింగిలోకి తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన రాకెట్‌ను తయారు చేసి సక్సెస్ చేసింది. ఈ రాకెట్‌ను బాహుబలి రాకెట్‌గా పిలిచేవారు.. ఇప్పుడు అంతకు మించి అన్నట్లు ఇంకా చెప్పాలంటే బాహుబలి 2 రాకెట్ అన్నట్లు LVM- 03 అప్‌గ్రేడ్ అయింది.. 6.5 టన్నుల బరువున్న అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశ పెట్టనుంది.. ప్రయోగ సమయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించనుంది.

టెక్సాస్ కేంద్రంగా పనిచేసే A స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన బ్లూబర్డ్ శ్రేణి ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా నేరుగా మొబైల్ బ్రాడ్‌ బ్యాండ్ సేవలను మెరుగ్గా అందించేందుకు ఈ బ్లూ బర్డ్ శాటిలైట్‌ను రూపొందించారు. ఈ ఉపగ్రహం హై బ్యాండ్‌విడ్త్‌ నెట్వర్క్ అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. భూమిపై పనిచేస్తున్న మొబైల్ నెట్‌వర్క్‌ సేవలకు లైసెన్స్‌ స్పెక్ట్రమ్‌ ద్వారా అనుసంధానం చేసి.. సేవలను విస్తరించేలా ఈ వ్యవస్థ పని చేస్తుంది. అక్టోబరు 19న అమెరికా నుంచి బ్లూబర్డ్-6 ఉపగ్రహం శ్రీహరికోటకు చేరి అనుసంధాన పనులు, ఇంధన నింపుదల, తుది తనిఖీల పరిశీలనలు శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. ఇతర ఉపగ్రహాల కంటే మూడున్నర రెట్లు పెద్దదిగా, సుమారు పది రెట్లు అధిక డేటా సామర్థ్యంతో పనిచేయనుంది. ఇదే రాకెట్ ద్వారా భారత్ చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది ఇస్రో.

Follow Us
పాడైన కిడ్నీలను నీరు బాగు చేయగలదా? అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు!
పాడైన కిడ్నీలను నీరు బాగు చేయగలదా? అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు!
మెటా నుంచి 16 వేల మంది ఉద్యోగుల తొలగింపు?
మెటా నుంచి 16 వేల మంది ఉద్యోగుల తొలగింపు?
రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ.. ఐదుగురికి పాజిటివ్..
రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ.. ఐదుగురికి పాజిటివ్..
తెలంగాణలో ఎయిర్‌పోర్టుల్లా మారనున్న 5 రైల్వే స్టేషన్లు!
తెలంగాణలో ఎయిర్‌పోర్టుల్లా మారనున్న 5 రైల్వే స్టేషన్లు!
100 రోగాలకు ఒకటే మందు..! ఐరన్, కాల్షియం టాబ్లెట్లు వద్దు
100 రోగాలకు ఒకటే మందు..! ఐరన్, కాల్షియం టాబ్లెట్లు వద్దు
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..