Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుతో మోహన్‌బాబు భేటీ.. రెండు గంటలపాటు చర్చలు..
మాజీ ఎంపీ, డైలాగ్ కింగ్ మోహన్‌బాబు చంద్రబాబును కలిశారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత ఇంటికే మోహన్‌బాబు వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. రెండు గంటలు ఇద్దరూ చర్చించారు.
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చోటు చేసుకుంది. మాజీ ఎంపీ, డైలాగ్ కింగ్ మోహన్‌బాబు చంద్రబాబును కలిశారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత ఇంటికే మోహన్‌బాబు వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. రెండు గంటలు ఇద్దరూ చర్చించారు. ఏపీ రాజకీయాలపైనే వీరిద్దరూ చర్చించారు. 2019 ఎన్నికల్లో వైసీపీకే మద్దతు ఇచ్చారు మోహన్‌బాబు. అప్పటి వరకు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఎన్నికల సమయంలో ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ తీరును విమర్శించే వారు మోహన్‌బాబు. ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఎందుకో ఏమో కానీ పార్టీకి, ఆయనకు కొంచెం గ్యాప్ వచ్చినట్లే కనిపించింది. సీఎం జగన్ సినిమా ఇండస్ట్రీ పెద్దలను కలిసినప్పుడు కూడా మోహన్‌బాబు ఎక్కడా కనిపించలేదు. ఈ పరిణామాలపై చాలా చర్చలు జరిగాయి. ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబుతో మోహన్‌బాబు భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..