Andhra Pradesh: ఏ ప్రభుత్వం చేయని విధంగా బాధితులను ఆదుకున్నాం.. కోనసీమ పర్యటనలో సీఎం జగన్
గోదావరి (Godavari) వరదలతో అతలాకుతలమైన కోనసీమ (Konaseema) జిల్లాల్లోని ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ సందర్శించారు. వరదల కారణంగా ఎంత వరకు నష్టం జరిగిందనే విషయంపై లెక్కలు రాగానే ప్రజల్ని ఆదుకుంటామని...
గోదావరి (Godavari) వరదలతో అతలాకుతలమైన కోనసీమ (Konaseema) జిల్లాల్లోని ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ సందర్శించారు. వరదల కారణంగా ఎంత వరకు నష్టం జరిగిందనే విషయంపై లెక్కలు రాగానే ప్రజల్ని ఆదుకుంటామని వెల్లడించారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా బాధితులను ఆదుకున్నామని పేర్కొన్నారు. పుచ్చకాయలవారి పేట, గంటిపెదపూడి, ఊడుమూడి లంక తదితర గ్రామాల్లో వరద (AP CM Jagan) బాధితులతో మాట్లాడారు. వారిని కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని, పరామర్శించారు. వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా రేపు (బుధవారం) కూడా సీఎం జగన్ పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి అల్లూరి జిల్లాలోని చింతూరుకు చేరుకోనున్నారు. ఆక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వరద బాధిత గ్రామాల ఫోటో గ్యాలరీని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రతి ఇంటికీ నష్టపరిహారం, నిత్యవసరాలు అందించాం. పశువులకు నోరు ఉంటే అవి కూడా మా సహాయాన్ని మెచ్చుకునేవి. మాకు సహాయం అందలేదని ఏ ఒక్కరూ చెప్పలేదు. వరదల్లో నేను వచ్చుంటే ఫోటోల్లో, టీవీల్లో బాగా కనిపించేవాడిని. కానీ నాకు పబ్లిసిటీ అవసరం లేదు. సామాన్య జనం ఇబ్బంది పడకూడదనే వారం రోజులు టైమ్ ఇచ్చి ఇప్పుడు వచ్చాను. ఈ ఏడాదిలోనే పంటలకు నష్టపరిహారం చెల్లిస్తాం.
– వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
అయితే.. కోనసీమలో భారీ వర్షం కురుస్తున్నా సీఎం జగన్ మాత్రం తన పర్యటనను కొనసాగిస్తున్నారు. వరదల సమయంలో వశిష్ట నదీ పాయ తెగిపోవడంతో లంక గ్రామ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధితులతో సీఎం జగన్ నేరుగా మాట్లాడి, పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. సీఎం జగన్ అరిగెలవారిపేట, ఉడిమూడిలంక, వాడరేవు పల్లిలోని వరద ముంపు బాధితుల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..