Amazing Fish Catching Process: గొడుగులతో చేపల వేట.. దొరికిన వాళ్లకు దొరికినన్నీ.. పోటీపడ్డ జనాలు
బాపట్లజిల్లా కొరిశెపాడు మండలం దైవరావూరు వద్ద స్థానికులు విచిత్రంగా చేపల వేట సాగించారు. గొడుగులు, దోమ తెరలతో పోటీలు పడిమరీ చేపలు పడుతున్నారు.
Amazing Fish Catching Process : బాపట్ల జిల్లాలో విచిత్ర సంఘటన వెలుగు చూసింది. బాపట్లజిల్లా కొరిశెపాడు మండలం దైవరావూరు వద్ద స్థానికులు విచిత్రంగా చేపల వేట సాగించారు. గొడుగులు, దోమ తెరలతో పోటీలు పడిమరీ చేపలు పడుతున్నారు. వానచ్చే… వరదొచ్చే… వాటితో పాటు చేపలొచ్చే… అంటూ దైవాలరావూరు యువకులు సందడి చేస్తున్నారు. అదితెలిసి చుట్టుపక్కల గ్రామస్తులు సైతం ఎగబడ్డారు. ఇదంతా ఎందుకంటే…ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దైవాలరావూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో కుప్పలు తెప్పలుగా చేపలు కొట్టుకు రావటంతో జనాలు ఎగబడ్డారు. సమయానికి చేతిలో వలలు లేకున్నా వెంట తెచ్చుకున్న గొడుగులతో చేపలు పడుతూ వెరైటీగా చేపలు పడుతున్నారు.
బాపట్లజిల్లా కొరిశెపాడు మండలం దైవరావూరు దగ్గర తూర్పు వాగుకు వరద వచ్చింది… గుండ్లకమ్మ డ్యాంనుంచి వరద నీరు దిగువకు విడుదల చేయడంతో దైవాలరావూరు దగ్గర తూర్పువాగుకు వరదనీరు భారీగా వచ్చింది… డ్యాంలో ఉన్న చేపలు కూడా వరదతో పాటు వచ్చాయి… దీంతో తూర్పువాగు చప్టా దగ్గర వాహనాలు ప్రమాదానికి గురికాకుండా రక్షణగా వచ్చిన యువకులు చేపలను చూసి సంబర పడ్డారు… వాటిని పట్టుకోవడం ఎలాగా అంటూ ఆలోచనలో ఉండగానే మెరుపులాంటి ఐడియా వచ్చింది… వర్షానికి తడవకుండా ఉండేందుకు తమ వెంట తెచ్చుకున్న గొడులనే వలలుగా చేసి వెరైటీగా చేపలు పట్టారు… ఒక్కో యువకుడు పదికేజీల వరకు చేపలు పట్టుకుంటున్నారు.
ఒకవైపు వాన, మరోవైపు ఫ్రీగా వచ్చిన చేపలు అంటూ తెగ సంబరపడిపోయారు… తూర్పువాగులోకి వరదతో పాటు చేపలు రావడంతో గ్రామానికి చెందిన యువకులంతా వచ్చి గొడుగులతోనే చేపలు పట్టుకుంటున్నామని, ఇది ఎంతో సంతోషంగా ఉందని కుషీకుషీగా చెప్పుకున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి