Viral Video: చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు కోతి పెద్ద స్కేచ్చే వేసింది.. ఏకంగా బైక్‌పై వచ్చి మరీ దాడి.. కట్ చేస్తే..

భయంతో వణికిపోయిన చిన్నారి ఏడుస్తూ తిరిగి వెనక్కి నడుచుకుంటూ వచ్చిన దృశ్యాలు సైతం మనం వీడియోలో చూడొచ్చు.

Viral Video: చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు కోతి పెద్ద స్కేచ్చే వేసింది.. ఏకంగా బైక్‌పై వచ్చి మరీ దాడి.. కట్ చేస్తే..
Monkey On A Bike
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 26, 2022 | 7:27 PM

Viral Video: సోషల్ మీడియా అనేది వివిధ రకాల వీడియోలతో నిండిన ప్రపంచం. ఇక్కడ మీరు వ్యక్తిగతంగా చూడలేని విషయాలను చూడవచ్చు. కొన్ని వీడియోలు మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. కొన్ని నిజంగా మనల్ని భయపెడతాయి. కొన్ని మన కళ్ళను చెమ్మగిల్లేలా చేస్తాయి. అయితే కొన్ని వీడియోలను చూసి మనం నిజంగానే షాక్ అవుతుంటాము.. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌గా మారుతున్న ఈ వీడియోలో, బైక్‌లా కనిపించే బొమ్మబండిపై కోతి స్వారీ చేయడాన్ని మీరు చూడవచ్చు. అక్కడ కొందరు పిల్లలంతా కలిసి ఆడుకుంటున్నారు. వాళ్లంతా ఎంజాయ్‌ చేస్తుంటే సడన్‌గా ఓ షాకింగ్‌ ఇన్సిడెంట్‌ జరిగింది. ఆ వీడియో చూస్తే నిజంగానే షాక్ అవుతారు.

బొమ్మ బైక్‌పై వేగంగా వచ్చిన కోతి అక్కడే ఆడుకుంటున్న చిన్నారుల వద్దకు చేరింది. బొమ్మ బైక్‌పై వేగంగా దూసుకొచ్చిన కోతి బొమ్మ బైక్ అక్కడే వదిలేసి ఏం చేసిందో చూస్తే నిజంగానే షాక్‌ అవుతారు. అక్కడ ఒక బెంచీ మీద ముగ్గురు పిల్లలు కూర్చుని ఉండగా, వారిలో ఓ చిన్నారిని కోతిలాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. అంటే ఆ బొమ్మ బైక్‌ని అక్కడే వదిలేసి, దానికి బదులు అక్కడ ఉన్న చిన్నారి లాగడం మొదలుపెట్టింది. అయితే ఒక్కసారిగా కోతి చేతిలోంచి పాప జారిపోతుంది.. అయినా కోతి వెనక్కి తగ్గకుండా చిన్నారిని లాగేందుకు ప్రయత్నిస్తోంది. ఆఖరికి అక్కడ డాబా మీద నిలబడి ఉన్నవాళ్ళు, మరికొందరు పెద్ద పెద్ద కేకలు వేస్తూ.. అరుస్తూ శబ్ధాలు చేస్తూ..పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిని చూసిన కోతి పిల్లని అక్కడే వదిలేసి పారిపోయింది.

ఇవి కూడా చదవండి

భయంతో వణికిపోయిన చిన్నారి ఏడుస్తూ తిరిగి వెనక్కి నడుచుకుంటూ వచ్చిన దృశ్యాలు సైతం మనం వీడియోలో చూడొచ్చు. స్థానికులు అప్రమత్తంగా ఉండటంతో కోతి చేతిలోంచి చిన్నారి తప్పించుకోగలిగింది..అక్కడ ఎవరూ లేకుంటే కోతి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి ఉండేది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ వైరల్ వీడియో @TheFigen అనే ట్విట్టర్ పేజీలో షేర్ చేయబడింది. ఇది పిల్లలను అపహరించే ప్రయత్నమని చెబుతున్నారు. ఏది ఏమైనా ఒకప్పటి పాత వీడియో మరోమారు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటి వరకు 41.9M వీక్షణలు మరియు 29.6k లైక్‌లు వచ్చాయి. వీడియో చూసిన తర్వాత మీరు షాక్ అవుతారనడంలో సందేహం లేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?