AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దున్నపోతుతో దిగివచ్చిన యమధర్మరాజు.. నడిరోడ్డుపై నిలబడి నిరసన.. ఎందుకో తెలిస్తే అవాక్కే!

అవును మీరు చదివింది నిజమే..ఆ యముడే నిరసన చేస్తున్నాడు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నరకాధిపతి యమరాజు..

Viral Video: దున్నపోతుతో దిగివచ్చిన యమధర్మరాజు.. నడిరోడ్డుపై నిలబడి నిరసన.. ఎందుకో తెలిస్తే అవాక్కే!
Yamadharmaraju
Jyothi Gadda
|

Updated on: Jul 26, 2022 | 6:00 PM

Share

Viral Video: ఆ యమధర్మరాజే స్వయంగా ధర్నాకు దిగితే ఎలా ఉంటుంది..అచ్చం ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో మాదిరిగానే ఉంటుంది. అవును మీరు చదివింది నిజమే..ఆ యముడే నిరసన చేస్తున్నాడు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నరకాధిపతి యమరాజు వేషధారణలో ఒక వ్యక్తి దున్నపోతును పట్టుకుని నడిరోడ్డుపై నిలబడి నిరసనకు దిగారు. కాగా నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఈ ఘటన ఐటీ రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. నగరంలోని రోడ్ల దుస్థితిని ఎత్తిచూపుతూ బెంగళూరులో ఓ వ్యక్తి ఇలాంటి విచిత్ర రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. బెంగళూరులో శిథిలావస్థకు చేరిన రోడ్డు మరమ్మతుల డిమాండ్‌పై ‘ఛేంజ్ మేకర్స్’ అనే సంస్థ బ్యానర్‌ కింద ఓ యువకుడు గేదెలతో యమరాజ్‌ వేషధారణతో వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపాడు. ఈ విషయమై ఆ సంస్థ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కనకపుర రోడ్డు దుస్థితిపై సదరు యువకుడు నిరసనకు దిగారు.

“రోడ్లపై యమరాజా? ఆశ్చర్యపోకండి, యమధర్మరాజుకు ప్రజల ప్రాణాలు తీయడానికి ఎమ్మెల్యే కృష్ణప్ప, BDA కలిసి టెండర్ ఇచ్చారు! నిన్న # CMKR అంజనాపురంలోని గుంతల రోడ్లపై ఒక ప్రత్యేక నిరసన చేశారు. నిరుడు కూడా వర్షాకాలంలో రోడ్ల దుస్థితి మీద తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేశారు. అయినా కూడా.. MLA కానీ.. BDA కానీ మొద్దునిద్ర పోతూనే ఉన్నారు’ అంటూ కనకపుర రోడ్‌కు చెందిన చేంజ్‌మేకర్స్ ట్వీట్ చేశారు.

‘ఈ రోడ్డు గురించి చెప్పడానికి మేము యమధర్మరాజు థీమ్‌ను ఎంచుకున్నాం. ఎందుకంటే ఈ రహదారిని ఉపయోగించే ప్రయాణికులకు నరకం కనిపిస్తుంది. అందుకే ఇదే సరైన థీమ్ అనిపించింది. అని కనకపుర రోడ్‌కు చెందిన చేంజ్‌మేకర్స్ కు చెందిన అబ్దుల్ అలీమ్ ఆరోపించారు. ఈ రోడ్డు గత పదేళ్లుగా అతి దారుణంగా ఉంది. ఇదొక్కటే కాదు అంజనాపురంలోని రోడ్లన్నీ ఒకేలా అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. గతేడాది తాము చేసిన ప్రత్యేక నిరసన కొంత ఫలితాలిచ్చిందని చెప్పారు. అయితే, కేవలం 2 కిలోమీటర్ల రోడ్డు వేశారు. 13 కిలోమీటర్ల రోడ్డు కోసం 25 కోట్లు విడుదలయ్యాయి’’ అని అలీం తెలిపారు.

యమధర్మరాజు పేరు చెప్పి ఎమ్మెల్యే, బిడిఎ అధికారులను ఇంత అవమానించినా వారిలో చలనం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. స్థానికుల ఇబ్బందులు పాలకులకు ఏ మాత్రం పట్టడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ రోడ్ల వల్ల అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. దాంతో అత్యవసర పరిస్థితిలో కారులో తరలించడంతో ఓ అపార్ట్ మెంట్‌ వాసి మృతి చెందినట్టుగా వారు వాపోయారు. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బిడిఎ), స్థానిక ఎమ్మెల్యే ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని.. సమస్యను త్వరగా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉగ్ర నిరసనలు చేపడతామని అలీం హెచ్చరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి