Viral Video: పబ్‌లో ఇద్దరు మహిళల వీరంగం.. ఎంట్రీలోనే యువకుడిని చితకొట్టారు..

ఆ మహిళలను, వారి చేతిలో దెబ్బతింటున్న వ్యక్తిని బౌన్సర్ విడదీశాడు. బాధితుడిని బయటకు పంపించారు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు.

Viral Video: పబ్‌లో ఇద్దరు మహిళల వీరంగం.. ఎంట్రీలోనే యువకుడిని చితకొట్టారు..
Lucknow Pub
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 26, 2022 | 7:55 PM

Viral Video: ఇటీవల గత కొంతకాలంగా పబ్‌ల చుట్టూ వివాదాలు, వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సారి వివాదానికి కేంద్రంగా మరో పబ్ నిలిచింది. ఆ పబ్‌లో పలువురు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. సరిగ్గా ఎంట్రీలోనే ఇద్దరు మహిళలు ఓ పురుషుడిపై విచక్షణారహిత దాడికి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందినదిగా తెలిసింది. లక్నోలోని అన్‌ప్లగ్‌డ్ కేఫ్‌ వద్ద జరిగిన సీన్‌ వైరల్‌ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తిని ఇద్దరు మహిళలు దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు మహిళలు ఓ వ్యక్తిపై దాడి చేశారు. అతడు వారికి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, వారు వినిపించుకునే దశలో లేరు. అందులో ఒక మహిళ అక్కడే డెకరేషన్‌లో భాగంగా ఉంచిన ఫ్లవర్ పాట్‌ను చేతిలోకి తీసుకుంది. ఆ పూల కుండితో ఆ వ్యక్తిపై భుజంపై కొట్టింది. ఆ కుండి పగిలిపోయే వరకు దాడి చేసింది. పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయని తలచి అక్కడే ఉన్న ఓ బాక్సర్ వెంటనే కలుగజేసుకున్నాడు. ఆ మహిళలను, వారి చేతిలో దెబ్బతింటున్న వ్యక్తిని బౌన్సర్ విడదీశాడు. బాధితుడిని బయటకు పంపించారు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

విభూతిఖంద్ పోలీసు స్టేషన్ ఏరియాలోకి వచ్చే అన్‌ప్లగ్‌డ్ కేఫ్‌లోకి పలువురు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. సరిగ్గా ఎంట్రీలోనే ఇద్దరు మహిళలు ఓ పురుషుడిపై విచక్షణారహిత దాడికి పాల్పడ్డారు.

అయితే, జరిగిన ఘటనకు సంబంధించిన తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు విభూతిఖంద్ పోలీసులు. ఒక వేళ ఫిర్యాదు అందితే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?