MLA Roja: నగరి డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే రోజా సందడి.. సీఎం కప్ పోటీలు ప్రారంభం..
నగరి డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే రోజా సందడి చేశారు. శుక్రవారం నగరిలోని డిగ్రి కళాశాలలో సీఎం కప్ పోటీల ప్రారంభోత్సవ
నగరి డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే రోజా సందడి చేశారు. శుక్రవారం నగరిలోని డిగ్రి కళాశాలలో సీఎం కప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీమతి రోజా పాల్గోన్నారు. విద్యార్థులు.. అధికారులతో కలిపి సీఎం కప్ పోటీల ప్రారంభోత్సవంలో చురుగ్గా సందడి చేశారు. అనంతరం విద్యార్థులను ఉత్సాహ పరచడానికి జావెలిన్ త్రో వేసి పోటీలను ప్రారంభించారు.
అలాగే ఈరోజు నగరీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యేందుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు రోజా. మీతో మీ ఎమ్మెల్యే అంటూ అధికారులతో కలిసి వార్డులలో పర్యటిస్తూ.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.ఈ క్రమంలో ప్రతి కుటుంబాన్ని పలకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యం.. వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత పెన్షన్లు, వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం తదితర పథకాల గురించి ఆరా తీశారు. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రోజా.. నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో స్వయంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలు పై ఆరా తీస్తున్నారు.
Bheemla Nayak: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ చిత్ర యూనిట్.. పవన్ కోసం సందడి చేస్తున్న ఫ్యాన్స్
Pushpa: థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప’ రాజ్.. బన్నీ సినిమాకి సంబంధించిన 9 అద్భుతాలు ఇవే!