Andhra Pradesh: మీరు కల్లాల్లో మిర్చి పంట పోసి.. ఆదరమరుస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
గుంటూరు జిల్లాలో జరుగుతున్న వరుస చోరీలతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. అసలే పంట దిగుబడి తగ్గిందని బాధలో ఉంటే.. ఇప్పుడు మిర్చి దొంగతనాల దెబ్బకు భయపడుతున్నారు.
Guntur District:దొంగలు(The Thieves) ఇప్పటి వరకు బంగారం, డబ్బులు, ఏదైనా వస్తువు ఎత్తుకెళ్లడం చూశాం. దొంగల్లో వీళ్లు వెరైటీ.. రైతులు కష్టపడి పండించిన మిర్చి(Chilli crop)ని పొలాల్లోనే మాయం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో జరుగుతున్న వరుస చోరీలతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. అసలే పంట దిగుబడి తగ్గిందని బాధలో ఉంటే.. ఇప్పుడు దొంగతనాల దెబ్బకు భయపడుతున్నారు. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది వేసిన మిర్చి పంటకు తామర పురుగు ఆశించడంతో దిగుబడి లేకుండా పోయింది. దీంతో మిర్చికి డిమాండ్ భారీగా పెరగడంతో.. అక్కడక్కడ కొంతమంది రైతులకు మాత్రమే ఎకరానికి పది క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. వచ్చిన పంటను జాగ్రత్తగా కాపాడుకుంటూ రైతులు వాటిని కోల్డ్ స్టోరేజ్‌లకు తరలిస్తున్నారు. అయితే మిర్చికి డిమాండ్ ఉందన్న సంగతి తెలుసుకున్న దొంగలు కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి దొంగలించే పనిలో పడ్డారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో మిర్చి దొంగలు హడలెత్తిస్తున్నారు. యడ్లపాడు మండలం తిమ్మాపురంలో కల్లంలో ఆరబెట్టిన మిర్చి కల్లంలోనే మాయం చేశారు. సుమారు ఆరున్నర క్వింటాళ్ల మిర్చి ఎత్తుకెళ్లారు దొంగలు. సుమారు 90 వేల రూపాయల విలువైన మిర్చి చోరీకి గురైంది. అటు పది రోజుల క్రితం నాదెండ్లలోనూ లక్ష రూపాయల విలువైన మిర్చిని అపహరించారు దొంగలు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read: Vizag: అవార్డు పొందిన ఆరు రోజులకే..!! కటకటాల వెనక్కు ఉత్తమ అధికారి..!