Minister Roja: వర్షంలోనూ ఏ మాత్రం తగ్గని మంత్రి రోజా.. సమస్యల పరిష్కారానికి ఇంటింటికి వెళ్లీ..

వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరాలని, వాటి వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అధికారులను..

Minister Roja: వర్షంలోనూ ఏ మాత్రం తగ్గని మంత్రి రోజా.. సమస్యల పరిష్కారానికి ఇంటింటికి వెళ్లీ..
Minister Roja
Follow us

|

Updated on: Dec 09, 2022 | 9:55 PM

వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరాలని, వాటి వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అధికారులను కాకుండా నేతలను నేరుగా ప్రజల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకునేలా ప్రణాళికలు రూపొందిచారు. ఇలా చేయడం ద్వారా ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించవచ్చని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క నేత.. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే. రోజా పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం సచివాలయం పరిధిలోని ఇళ్లకు వెళ్లారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పరమేశ్వర మంగళం, వడ్డి ఇండ్లు గ్రామాల్లో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

కాగా.. గతంలో మంత్రి రోజా కు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఊహించని పరిణామం ఎదురైంది. నగరి నియోజకవర్గంలో పర్యటించి.. ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న ఆమెకు ఓ వృద్ధుడి నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఫించన్ అందుతుందా అని మంత్రి ప్రశ్నించగా.. అందుకతడు బదులివ్వకుండా తాను ఒంటరివాడనని, తనకెక్కడైనా పిల్లను చూడాలని, పెళ్లి కావాలంటూ విన్నవించాడు. ఈ జవాబుతో అవాక్కైన మంత్రి రోజా ఒక్కసారిగా నవ్వేశారు. పెద్దాయన ప్రశ్నకు రోజా బదులిస్తూ తాను పెన్షన్లు మాత్రమే అందేలా చూడగలనని, అమ్మాయిలను చూడడం తన పని కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు