RK Roja: అరసున్నా, అరసున్నా.. కలిస్తే గుండుసున్నా.. ఫ్యాషన్ షో బ్యాచ్‌తో ఏమవుతుంది.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..
నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారంటూ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. తాము కూడా నిజం గెలవాలనే శ్రీవారిని కోరుకున్నామన్నారు. నిజం గెలిస్తే చంద్రబాబుతోపాటు భువనేశ్వరి, లోకేష్ కూడా జైలుకెళ్తారని.. కేసులపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అంటూ మంత్రి రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. మీడియాతో మాట్లాడారు.

నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారంటూ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. తాము కూడా నిజం గెలవాలనే శ్రీవారిని కోరుకున్నామన్నారు. నిజం గెలిస్తే చంద్రబాబుతోపాటు భువనేశ్వరి, లోకేష్ కూడా జైలుకెళ్తారని.. కేసులపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అంటూ మంత్రి రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. మీడియాతో మాట్లాడారు. ఇప్పట్లో చంద్రబాబు బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. నిజం ఒప్పుకుంటే కనీసం బెయిల్ అయినా వస్తుందేమోనంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పవన్, లోకేష్ భేటీపై సెటైర్ల మీద సెటైర్లు పేల్చారు మంత్రి రోజా. అర సున్నా, అర సున్నా కలిస్తే గుండు సున్నా.. అని.. దాని కోసం ఏం చేసినా వర్కవుట్ కానేకాదన్నారు. భువనేశ్వరి, బ్రహ్మణిపైనా ఒక రేంజ్‌లో విరుచుకుపడ్డారు. లోకేష్ వల్లే కాలేదు.. ఇక, ఈ ఫ్యాషన్ షో బ్యాచ్‌తో ఏమవుతుందంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు పై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే హెరిటేజ్ లో ఉన్నవాళ్లంతా జైలుకెళ్తారన్నారు. అప్పుడే నిజం గెలుస్తుందంటూ రోజా పేర్కొన్నారు. నారా భువనేశ్వరి శ్రీవారిని మొక్కుకోవడం చూస్తే.. చంద్రబాబు జైల్లోనే ఉండాలని కోరుకున్నట్లుగా ఉందని ఎద్దెవా చేశారు. పవన్ లోకేష్.. టీమ్ మీటింగ్ పాడుతా తీయగా కార్యక్రమంలో ఉందని.. అరసున్నా, అరసున్న కూర్చుని లోపల ఉన్న గుండు సున్నా కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంటే ప్రజలంతా ఫన్నీగా ఫీల్ అవుతున్నారంటూ రోజా పేర్కొన్నారు.
సీఎం జగన్ మరో 30 ఏళ్ల పాటు పరిపాలించాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి రోజా చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వై ఏపీ నీడ్స్ జగన్.. కార్యక్రమం పేరుతో జనం ముందుకు ధైర్యంగా వెళుతున్నామన్నారు. వై ఏపీ నీడ్స్ చంద్రబాబు.. వై ఏపీ నీడ్స్ పవన్.. పేరుతో జనం ముందుకు వెళ్లే ధైర్యం టీడీపీ, జనసేనలకు ఉందా అంటూ.. రోజా ప్రశ్నించారు.
చంద్రబాబు బయటికి వచ్చేది లేదు, భువనేశ్వరి యాత్ర చేసే పరిస్థితి కూడా లేదంటూ రోజా పేర్కొన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర చేయలేక మంగళం పాడారని.. ఫ్యాషన్ షోలోకి వెళ్లేలాగా జాలీగా జనంలోకి వచ్చి కష్టపడలేరన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తిన్న డబ్బు కట్టి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి బెయిల్ కోసం అప్పీలు చేస్తే అప్పుడు రావచ్చంటూ రోజా అభిప్రాయపడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
