Chandrababu Vs Peddireddy: ‘కుప్పంలో అటెండర్‌ను పోటీ చేయించి గెలిపిస్తా’.. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్..

Chandrababu Vs Peddireddy: ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతుంది.  తాజాగా చిత్తూరు జిల్లా వేదికగా ఇరుపార్టీకి చెందిన అగ్రనేతల..

Chandrababu Vs Peddireddy: 'కుప్పంలో అటెండర్‌ను పోటీ చేయించి గెలిపిస్తా'.. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్..
Chandrababu Vs Peddireddy
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2022 | 7:51 PM

Chandrababu Vs Peddireddy: ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతుంది.  తాజాగా చిత్తూరు జిల్లా వేదికగా ఇరుపార్టీకి చెందిన అగ్రనేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. టీటీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు అన్న సంగతి తెలిసిందే..  అధికార పార్టీ అగ్రనేత.. మంత్రి పెద్ది రెడ్డి కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అన్న సంగతి తెలిసిందే.. అయితే చంద్రబాబుకు, పెద్ది రెడ్డికి  మధ్య రాజకీయ విబేధాలు ఎప్పటినుంచో కొనసాగుతున్న సంగతి తెలిసిందే..

తాజాగా చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తూ.. పెద్దిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పెద్దిరెడ్డి ఇంకాస్త డోస్ పెంచారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలు విసిరారు. ఈ సారి పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తానన్న చంద్రబాబుకు మంత్రి పెద్ది రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. అంతేకాదు.. అసలు కుప్పంలో ఈసారి నా అటెండర్ ను పోటీ చేయించి చంద్రబాబును ఓడిస్తానని పెద్ది రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే మంత్రి పెద్ది రెడ్డి సవాల్ కు టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి స్పందించారు. కుప్పంలో అటెండర్ ఎందుకు దమ్ముంటే నువ్వే వచ్చి కుప్పంలో గెలిచి చూపించాలని ప్రతి సవాల్ విసిరారు.  ఇప్పుడు పెద్ది రెడ్డి విసిరిన సవాల్ కు చంద్రబాబు సై అంటే.. చిత్తూరు రాజకీయాలే కాదు.. మొత్తం ఏపీ రాజకీయాలే వేడెక్కే అవకాశం ఉంది.

Also Read:

మహేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ సెలబ్రెటీల ట్వీట్స్..

 కేవలం దర్శనంతోనే అన్ని కోరికలు నెరవేర్చే విష్ణువుకు చెందిన దేశంలోని ఐదు ప్రసిద్ధ దేవాలయాలు..

కుక్క బర్త్‌డేకు కోట్లు ఖర్చు | మంచి మనసు చాటుకున్న పుష్ప మేకర్స్..లైవ్ వీడియో