- Telugu News Photo Gallery Cinema photos Tollywood celebs wish mahesh babu a speedy recovery from COVID 19
Mahesh Babu: మహేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ సెలబ్రెటీల ట్వీట్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. స్వల్ప లక్షణాలతో మహేష్ కు కరోనా సోకింది.
Updated on: Jan 07, 2022 | 7:41 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. స్వల్ప లక్షణాలతో మహేష్ కు కరోనా సోకింది.

మహేష్ కరోనా బారిన పడిన విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మహేష్ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు చేస్తున్నారు.

మహేష్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా వ్యాపించింది. గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారందరు కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని మహేష్ కోరారు

ఇక మహేష్ త్వరగా కోలుకోవాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా కోరుకున్నారు. మహేష్ అన్న మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని తారక్ ట్వీట్ చేశారు.

అలాగే మహేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కోరుతూ ట్వీట్ చేశారు.

ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ మూవీ దర్శకుడు అనీల్ రవి పూడి కూడా మహేష్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు.

రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ విషయం పై స్పందిస్తూ మహేష్ సార్ జాగ్రత్తగా ఉండండి. మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అని ట్వీట్ చేశారు.




