Andhra Pradesh: రాజకీయాల్లో ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు కాదు.. రజనీకాంత్‌పై మంత్రి అమర్‌నాథ్ ఫైర్
ఇటీవల ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకల్లో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి చంద్రబాబు నాయుడి పాలన గురించి పొగిడిన విషయం తెలిసిందే. అయితే రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఇటీవల ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకల్లో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి చంద్రబాబు నాయుడి పాలన గురించి పొగిడిన విషయం తెలిసిందే. అయితే రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయనపై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శలు గుప్పించారు. 1995 వెన్నుపోటు ఎపిసోడ్ నుంచి రజనీకాంత్ చంద్రబాబు అనుచరునిగా ఉన్నట్లు పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమరనాథ్ విమర్శించారు. రాజకీయాల్లో ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు కాదని.. అందుకే రజనీకాంత్ రాజకీయాల్లో రాణించలేకపోయారని ఆరోపించారు.
మరోవైపు అనుమతులు లేకుండా, భూసేకరణ జరపకుండా చంద్రబాబు నాయుడు 2019 ఫిబ్రవరి14న భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఫేక్ శంకుస్థాపన చేసినట్లు దుయ్యబట్టారు. ఇప్పుడు అనుమతులున్నీ పూర్తి చేసుకున్నాక భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూ.5 వేల కోట్ల పెట్టుబడితో తొలిదశ నిర్మాణానికి బుధవారం సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే రూ.14,500 కోట్లతో 25 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించే విధంగా అదాని డేటా టెక్ పార్క్ సైతం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రూ.6,500 ఆర్ కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఆరులైన్ల బీచ్ రోడ్ ప్రారంభం కానుందని వివరించారు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల వలే విశాఖపట్నం-విజయనగరం రూపుదిద్దుకోనున్నాయని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..