Watch Video: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నకు మంత్రి అచ్చెన్న ఆసక్తికర సలహా..

ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి శాసనసభాపతిగా తమ అవతారం మార్చాలని సూచించారు. మొన్నటి వరకు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోశించారనని, ఆ సందర్భంగా కొన్ని పదునైన మాటలు మాట్లాడవలసి వస్తుందన్నారు. దీనికి కారణం ఎదుటివారి విమర్శలకు సరైన సమాధానం చెప్పేందుకు అలాంటి మాటలు అవసరమవుతాయన్నారు.

Watch Video: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నకు మంత్రి అచ్చెన్న ఆసక్తికర సలహా..
Minister Atchannaidu
Follow us

|

Updated on: Jun 22, 2024 | 3:48 PM

ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి శాసనసభాపతిగా తమ అవతారం మార్చాలని సూచించారు. మొన్నటి వరకు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోశించారనని, ఆ సందర్భంగా కొన్ని పదునైన మాటలు మాట్లాడవలసి వస్తుందన్నారు. దీనికి కారణం ఎదుటివారి విమర్శలకు సరైన సమాధానం చెప్పేందుకు అలాంటి మాటలు అవసరమవుతాయన్నారు. అయితే ఇకపై అలాంటి పదాలను ఉపయోగించకుండా హుందాగా ఉండాలని కోరారు. 2024-2029లో నిర్వహించే శాసనసభ దేశానికే రోల్ మోడల్‎గా నిలవాలన్నదే తన కోరిక అని చెప్పారు.

బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఈ సభ చాలా మందికి ఆదర్శంగా ఉండాలని తెలిపారు. ఈ సభ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధంగా, గొప్పగా చెప్పుకునే విధంగా తమందరూ ప్రవర్తించాలని సూచించారు. అందుకే ఇకపై స్పీకర్‎గా అయ్యన్నపాత్రుడి అవతారం మార్చాలని విజ్ఙప్తి చేశారు. కొత్తగా ఎంపికైన 88 మంది శాశనసభ్యులకు ఆదర్శంగా నిలవాలన్నారు. అసెంబ్లీలో పార్టీలు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్డీయేకు ప్రజలు అఖండమైన విజయాన్ని అందించారని, దీనిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..