AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambati Rambabu: రైతుల కంటే రాజకీయ నాయకులే ఎక్కువ.. యాత్ర మధ్యలోనే ఆగిపోతుంది.. మంత్రి అంబటి కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరూతూ పాదయాత్ర చేపట్టిన రైతులకు పొలిటికల్ హీట్ తగులుతోంది. ఈ పాదయాత్రకు విపక్ష, ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు ఇస్తుండగా.. అధికార..

Ambati Rambabu: రైతుల కంటే రాజకీయ నాయకులే ఎక్కువ.. యాత్ర మధ్యలోనే ఆగిపోతుంది.. మంత్రి అంబటి కామెంట్స్
Ambati Rambabu
Ganesh Mudavath
|

Updated on: Oct 22, 2022 | 5:01 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరూతూ పాదయాత్ర చేపట్టిన రైతులకు పొలిటికల్ హీట్ తగులుతోంది. ఈ పాదయాత్రకు విపక్ష, ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు ఇస్తుండగా.. అధికార పార్టీ నేతలు, మంత్రులు మాత్రం ఫేక్ పాదయాత్ర అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు రైతులు వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలో మహాపాదయాత్ర – 2 పై మంత్రి అంబంటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజమైన రైతుల కంటే రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారని అన్నారు. ఈ యాత్ర మధ్యలోనే ఆగిపోతుందని జోస్యం చెప్పారు. ఆధార్‌ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్‌ పాదయాత్ర కాదా అని ప్రశ్నించారు. 40 రోజులుగా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అమరావతి పాదయాత్ర చేశారని, రైతుల పేరుతో రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తున్నారని మంత్రి అంబటి మండిపడ్డారు. పాదయాత్రకు కలిగిన విరామం తాత్కాలికం కాదని, ఇది శాశ్వత విరామమని వ్యాఖ్యానించారు.

టెంపుల్స్‌కు వెళ్లాల్సిన యాత్ర నియోజకవర్గాల నుంచి ఎందుకు వెళుతున్నాయి. అమరావతి యాత్ర రాజకీయ పాదయాత్రగా తయారైంది. తెలుగుదేశం, జనసేన నాయకులు కలిపి చేస్తున్న పాదయాత్ర ఇది. అరసవల్లి సూర్యదేవాలయానికి వెళ్లే అర్హత మీకు లేదు. పాదయాత్రలో ఉన్నవాళ్లంతా రైతులు కాదు… దోపిడీ దొంగలు.

– అంబటి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి

ఇవి కూడా చదవండి

మరోవైపు.. పోలీసుల తీరుకు నిరసనగా మహాపాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రైతులు ప్రకటించారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకొని పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామన్నారు. కాగా అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర 41వ రోజుకు చేరుకుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామంచంద్రాపురం బైపాస్‌ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రైతులు విడిది చేసిన ఫంక్షన్‌ హాల్‌ను ఈ ఉదయాన్నే పోలీసులు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పాదయాత్రలో పాల్గొనే 600 మంది గుర్తింపు కార్డులు చూపించాలని పోలీసులు కోరారు. దీంతో రైతులు, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

అయితే పోలీసులు తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా పాదయాత్రను తాత్కాలికంగా విరామం చేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టే విధంగా పోలీసు, ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, ఎదురవుతున్న అవాంతరాలన్నింటినీ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని రైతులు స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్