AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆ గ్రామంలో ప్రతి ఇంటికి పాలు ఉచితం.. ఎన్నో ఏళ్లుగా.. కారణం తెలిస్తే స్టన్

గ్రామాల్లో ఎక్కువమంది పాడి మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఇంట్లో ఒక్క గేదె ఉన్నా.. పాలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటారు. అలా కాకుండా పాలు ఫ్రీగా ఇస్తే.. అలాంటి గ్రామం అసలు ఉందా.? అంటే ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Andhra: ఆ గ్రామంలో ప్రతి ఇంటికి పాలు ఉచితం.. ఎన్నో ఏళ్లుగా.. కారణం తెలిస్తే స్టన్
Milk Free
Nalluri Naresh
| Edited By: |

Updated on: Aug 02, 2025 | 1:42 PM

Share

శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లవారిపల్లెలో పాలు అమ్మరు. పాలు ఉచితంగా ఇవ్వడం ఆ గ్రామం ప్రత్యేకత. పాలు ఉచితంగా ఇవ్వడానికి ఓ బలమైన కారణమే ఉంది. ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం శ్రీ కాటి కోటేశ్వరుడు పాలకావిడితో చిల్లవారిపల్లె వచ్చారట. అప్పటి నుంచి ఆ గ్రామస్థులు శ్రీ కాటి కోటేశ్వరుడుని తమ ఇలవేల్పుగా కొలుస్తూ వస్తున్నారు. శ్రీ కాటి కోటేశ్వరుడు చిల్లవారిపల్లె గ్రామం వచ్చిన దగ్గర నుంచి పాడిపంటలకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో.. ఆయన ప్రతిరూపమే పాలు అని ఆ గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు.

ఇది చదవండి: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..

అప్పటి నుంచి ఇప్పటి వరకు చిల్లవారిపల్లె గ్రామంలో పాలను ఉచితంగా పోయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. గ్రామంలో మొత్తం 400 కుటుంబాలు ఉంటే.. ఆవులు, గేదెలు కలిపి 315 వరకు ఉన్నాయి. దీంతో చిల్లవారిపల్లె గ్రామంలో రోజు 400 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. అందరికీ పాడి ఉంటే ఇక పాలు ఉచితంగా ఎవరు పోయించుకుంటారని అనుకుంటున్నారా.? గ్రామంలో పాడిలేని కుటుంబాలకు పాలు ఉచితంగా పోయడమే కాకుండా.. పొరుగు గ్రామస్థులు పాల కోసం వచ్చినా.. పాలు అమ్మకుండా ఉచితంగా పాలు పోస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒకప్పుడు ఈ హీరోయిన్‌ను కుక్కతో రీప్లేస్ చేశారు.. ఇప్పుడు రూ. 163 కోట్లతో పాన్ ఇండియా ఫేమస్..

వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారికైనా ఈ భూప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరమైన పాలు చిల్లవారిపల్లె గ్రామంలో ఉచితంగా ఇవ్వడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అయితే రానురానూ.. కొన్ని కుటుంబాలు పాలు అమ్ముతున్నారని.. ఇంకొన్ని కుటుంబాలు మాత్రమే ఇంకా పాలను ఉచితంగానే పోస్తున్నారట.

ఇది చదవండి: బాబోయ్‌.. ఇది బాహుబలి కారు అండీ.! 754 కిమీ రేంజ్.. ధర తెలిస్తే బిత్తరపోతారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి