AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime: ప్రేమించానంటూ పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.. చివరికి ఏం జరిగిందంటే!

Dowry Harassment Case: ప్రేమ అంటూ వెంటపడ్డాడు.. ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు.. ఆ తర్వాత అసలు కథ మొదలు పెట్టాడు. ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలంటూ..

AP Crime: ప్రేమించానంటూ పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.. చివరికి ఏం జరిగిందంటే!
Woman Suicide
Shaik Madar Saheb
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 18, 2022 | 11:46 AM

Share

Dowry Harassment Case: ప్రేమ అంటూ వెంటపడ్డాడు.. ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు.. ఆ తర్వాత అసలు కథ మొదలు పెట్టాడు. ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలంటూ.. భార్యను వేధించాడు. వేధింపులు రోజురోజుకూ పెరగడంతో.. ఆమెకు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఇటు పుట్టింటికి చెప్పుకోలేక.. అటు కట్టుకున్న భర్త హింసను తట్టుకోలేక చివరకు ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ( krishna district) పెడనలో చోటుచేసుకుంది. పెడనకు చెందిన సుకుమలక్ష్మీ (Woman).. ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఐదు వారాల గర్భవతి.

ఈ క్రమంలో భర్త వరకట్న కోసం వేధింపులు మొదలు పెట్టాడు. తనతో జీవన కొనసాగించాలంటే.. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాంటూ నిత్యం హింసించేవాడు. ఇదే విషయంపై గతకొద్ది రోజులుగా భార్యభర్తల మధ్య తరచూ వివాదం జరుగుతోంది. అయితే.. పరిస్థితి గురించి సుకుమలక్ష్మి తన తల్లికి ఫోన్ చేసి వివరించింది. అయితే.. తల్లి ఇంటికి చేరుకునే సరికి కుసుమలక్ష్మి తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లి గుండెలవిసేలా రోదించింది. ఆమె మృతికి భర్తే కారణమని.. అతని వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని ఆమె పేర్కొంటోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని మార్చురికి తరలించారు. భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Orvakal Fire Accident: రెండు రోజులైనా కనిపించని బాలిక ఆచూకీ.. ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు..

AP Crime News: మద్యం విషయంలో విబేధాలు.. ఓ వ్యక్తిని చంపేందుకు గన్ కొనుగోలు చేసి..