Orvakal Fire Accident: రెండు రోజులైనా కనిపించని బాలిక ఆచూకీ.. ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు..
Orvakal Fire Accident: ఏపీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు రోజులైనా చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. ఐదేళ్ళ పాప ఆచూకీ కనిపించకపోవడంతో
Orvakal Fire Accident: ఏపీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు రోజులైనా చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. ఐదేళ్ళ పాప ఆచూకీ కనిపించకపోవడంతో బుధవారం నుంచి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మంటల్లో (Fire Accident) చిక్కుకొని ఉండొచ్చన్న తల్లిదండ్రుల సూచన మేరకు కాలి బూడిదైన వరిగడ్డిని అధికారులు జేసీబీల సహాయంతో పక్కకు లాగుతున్నారు. (orvakal ) పుట్టగొడుగుల ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. నాలుగు ఫైరింజన్ల సహాయంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వివరాలు.. కోల్‌కతాకు చెందిన పరోలి బిబి, శారదా ముల్లా దంపతులు తమ కూతురు ములిరా ముల్లతో కలిసి బతుకుదెరువు కోసం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామంలో ఉన్న పుట్టగొడుగుల ఫ్యాక్టరీకి వచ్చారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన అయిదు వందల మంది వరకు కూలీలు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఈ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పుట్టగొడుగుల పెంపకానికి ఉపయోగించే గుట్టలుగా పోసిన 2,000 టన్నుల వరకు వరి గడ్డి పూర్తిగా దగ్ధమైంది. మంటలు ఆర్పేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఫైరింజన్లు తీసుకువచ్చారు. అందరూ సేఫ్ గా ఉన్నప్పటికీ ఐదేళ్ళ పాప కనిపించకపోవడం లేదు. దాంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాప ఫోటో చూసుకుంటూ బాధిత తల్లిదండ్రులు రోదిస్తున్నారు. వరిగడ్డిని తీస్తున్నప్పటికీ.. చిన్నారి ఆచూకీ రెండు రోజుల నుంచి లభించలేదు. బాలిక ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read: