AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: ఫేస్‌బుక్‌లో పరిచయమవుతాడు.. ఆ తర్వాతే అసలు కథ స్టార్ట్.. మూడేళ్ల క్రితం స్టోరీ మళ్లీ రిపీట్

Guntur District: ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఇద్దరు కూడా మంచి స్నేహితుల్లా మారారు. ఆ తర్వాత అసలు ట్విస్ట్ మొదలైంది. పరిచయమైన వ్యక్తి.. టూర్ కి వెళదామంటూ మాటల్లో పెట్టి కిడ్నాప్ చేసి డబ్బులు వసూలుకు పాల్పడుతున్నాడు.

AP Crime News: ఫేస్‌బుక్‌లో పరిచయమవుతాడు.. ఆ తర్వాతే అసలు కథ స్టార్ట్.. మూడేళ్ల క్రితం స్టోరీ మళ్లీ రిపీట్
Guntur Police
Shaik Madar Saheb
|

Updated on: Feb 14, 2022 | 7:44 AM

Share

Guntur District: ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఇద్దరు కూడా మంచి స్నేహితుల్లా మారారు. ఆ తర్వాత అసలు ట్విస్ట్ మొదలైంది. పరిచయమైన వ్యక్తి.. టూర్ కి వెళదామంటూ మాటల్లో పెట్టి కిడ్నాప్ చేసి డబ్బులు వసూలుకు పాల్పడుతున్నాడు. ఇలా ఒక్కసారి కాదు.. ఏకంగా రెండు సార్లు జరిగింది. అదేంటీ అనుకుంటున్నారా..? మూడేళ్ల క్రితం జరిగిన స్టోరీ మళ్లీ రిపీటైంది. ఈ ఘటనల్లో బాధితుడు ఒక్కడే.. నిందితుడు కూడా పాత వ్యక్తే. అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాలోని తెనాలి (Tenali) మండలం అంగలకుదురులో ఉంటున్న వ్యక్తికి.. హైదరాబాద్ లో ఉంటున్న సూర్య అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. బాపట్ల సూర్యలంక బీచ్‌కి తన స్నేహితులతో వస్తున్నానని, అక్కడికి రావాలంటూ సూర్య బాధితుడిని ఆహ్వానించాడు. అంతేకాకుండా సూర్యలంక వెళ్లేందుకు తెనాలి వచ్చిన సూర్య కారులో బాధితుడు ఎక్కాడు.. అయితే సూర్యలంక కాకుండా అదే కారులో హైదరాబాద్ (Hyderabad) తీసుకెళ్లి బాధితుడిని కిడ్నాప్ చేశారు. 50వేల రూపాయలు డిమాండ్ చేశారు నిందితుడు. తన తల్లి ద్వారా గూగుల్ పే చేయించాడు బాధితుడు.. అయితే ఇది జరిగి మూడేళ్లు… కాకపోతే అదే సూర్య మహిళా ప్రొఫైల్తో మరలా బాధితుడికి పరిచయమయ్యాడు.

జనవరి18 న సూర్యాపేట రావాలని, నిన్ను కలవాలని ఉంది అని చెప్పగానే, సూర్యాపేట వెళ్ళాడు బాధితుడు.. అయితే అక్కడ సూర్యని చూడగానే అవాక్కయ్యాడు బాధితుడు. మరలా కిడ్నాప్కు గురయ్యాడు. ఈసారి 55వేలు గుంజాడు. అక్కడి నుంచి తప్పించుకుని తెనాలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టి నాగరాజు, టీవీ9 తెలుగు రిపోర్టర్, గుంటూరు

Also Read:

Andhra Pradesh: ప్రియుడు మోజులో భర్తను హత్య చేసిన భార్య జైలు.. అనాధలుగా మారిన ఇద్దరు చిన్నారులు

Andhra Pradesh: పసికందును చంపి ఉరేసుకున్న తల్లి..! పోలీసులు సైతం కన్నీరు.. కానీ చివరి నిమిషంలో