AP News: పైన పటారం.. లోన లొటారం.. హ్యాండ్సమ్ ఫొటోతో యువతిని ట్రాప్ చేశాడు.. అమెరికాలో సాఫ్ట్‌వేర్ అంటూ..

మ్యాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా పెళ్లి పేరుతో అమ్మాయిలను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. కొచ్చర్ల శ్రీకాంత్‌ అనే పేరుతో.. పొట్లూరి వంశీకృష్ణ అనే వ్యక్తి మ్యాట్రిమోని సైట్‌ ద్వారా ఓ యువతిని ట్రాప్‌ చేశాడు.

AP News: పైన పటారం.. లోన లొటారం.. హ్యాండ్సమ్ ఫొటోతో యువతిని ట్రాప్ చేశాడు.. అమెరికాలో సాఫ్ట్‌వేర్ అంటూ..
Ap Crime News
Follow us

|

Updated on: Sep 14, 2022 | 5:30 PM

Man cheats woman on matrimonial website: బయటకు కనిపించే కటౌట్, పేరు వేరు.. మ్యాట్రిమోని సైట్‌లో కనిపించే ఫొటో, పేరు వేరు.. అమెరికాలో సాఫ్ట్‌వేర్.. రూ. లక్షల్లో సంపాదన అంటూ యువతులను మభ్యపెడతాడు.. ఇలా.. వారిని నమ్మించి రూ. లక్షలు కాజేస్తాడు. తాజాగా.. ఓ సైబర్‌ నేరగాడి ఆటకట్టించారు ఏపీలోని పల్నాడు జిల్లా పోలీసులు.. మ్యాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా పెళ్లి పేరుతో అమ్మాయిలను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. కొచ్చర్ల శ్రీకాంత్‌ అనే పేరుతో.. పొట్లూరి వంశీకృష్ణ అనే వ్యక్తి మ్యాట్రిమోని సైట్‌ ద్వారా ఓ యువతిని ట్రాప్‌ చేశాడు. తాను అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్‌ చేస్తున్నాని పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి పేరుతో అమ్మాయిలను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న వంశీకృష్ణ.. అలానే.. పల్నాడుకు చెందిన ఓ యువతి నుంచి రూ.48 లక్షలు కాజేశాడు. ఆపై అతడు అడ్రస్‌ లేకుండా పోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి కంప్లైంట్‌తో రంగంలోకి దిగిన పోలీసులు నేరస్థుడి అసలు చిట్టా బయటపెట్టారు. అతడి కొచ్చర్ల శ్రీకాంత్‌ కాదని అసలు పేరు పొట్లూరి వంశీకృష్ణ అని తెలిపారు. విజయవాడకు చెందిన ఇతను ఆన్‌లైస్‌ వెబ్‌సైట్ల ద్వారా ఇలా మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. వంశీకృష్ణను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడి నుంచి 38 లక్షలు రీకవరి చేశారు. వంశీకృష్ణపై గతంలోనూ ఎనిమిది కేసులు ఉన్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నరసరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..