Ap Employees: హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. జూన్ 26 వరకు పొడిగింపు
Ap Employees: ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి అమరావతి కి తరలివచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగిస్తూ నిర్ణయం..
Ap Employees: ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి అమరావతి కి తరలివచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే జూన్ 26 వరకు వసతి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ వసతి పొడిగింపుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో జూలైలో ప్లాట్లను వదిలి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ఈ విషయాన్ని సెక్రటేరియట్ ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం వసతి సదుపాయన్ని రెండు నెలల పాటు పొడిగించింది. తాజాగా వచ్చే ఏడాది జూన్ 26 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి