Nuzvid Mango : నూజివీడును ఉద్యానవన పంటల హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం : వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు
దేశంలో అత్యధిక ధర పలికే మామిడి నూజివీడు నుంచి వెళుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. నూజివీడు మామిడికి..
Make Nuzvid horticulture hub : దేశంలో అత్యధిక ధర పలికే మామిడి నూజివీడు నుంచి వెళుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. నూజివీడు మామిడికి దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందన్నారు. రూ.250 కోట్లతో జామ, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. రూ.2600 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో ఒక హార్టికల్చర్ హబ్ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. నూజివీడులో మంత్రి కన్నబాబు ఇవాళ పర్యటించారు. ఏపీ ఆగ్రోస్ వేపర్ హీటింగ్ ప్లాంట్, జొన్న ఆధారిత పాప్ కార్న్ ప్లాంట్ , ఆర్కిట్స్ ప్లాంటేషన్ యూనిట్లను సందర్శించారు.
ఆయిల్ ఫామ్ రైతులకు ఓఈఆర్ ధర చెల్లిస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. టన్ను రూ.7వేల నుంచి రూ.19 వేలు ధర దాటేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మామిడి తోటల పునరుద్ధరణకు రూ.20 వేల ఆర్థికసాయం అందించనున్నట్టు వివరించారు.
రైతు అవసరాలను తీర్చేందుకు సీఎం వైయస్ జగన్ నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి కన్నబాబు వెల్లడించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే ప్రతాప వెంకట అప్పారావు, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.