Andhra Pradesh: బాత్రూంలో ఉంటున్న కుటుంబానికి నాలుగు నెలల్లో ఇల్లు కట్టించి ఇచ్చిన ఎమ్మెల్యే..!
ఇచ్చిన మాట ప్రకారం సరిగ్గా నాలుగు నెలల్లోనే నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు. దాదాపు ఆరు లక్షల వ్యయంతో ఒక హాల్, బెడ్ రూమ్, కిచెన్ తో కూడిన పక్కా గృహాన్ని కట్టించి.. నరసింహప్పకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఇంటి తాళాలు అందజేశారు. కొత్త ఇంట్లో పూజలు చేసి.. పాలు పొంగించి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు నిరుపేద నరసింహప్ప కుటుంబంతోపాటు గృహప్రవేశం చేశారు

శ్రీసత్య సాయి జిల్లా మడకసరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సరిగ్గా నాలుగు నెలల క్రితం.. అంటే సెప్టెంబర్ 25వ తేదీన ఓ నిరుపేద కుటుంబానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మడకశిర మండలం హెచ్ఆర్ హళ్ళిలో నరసింహప్పా అనే నిరుపేద కుటుంబం నిలువ నీడ లేక… ఏడు సంవత్సరాలుగా బాత్రూంలో కాపురం ఉంటున్నారు. ఈ సంగతి తెలుసుకున్న మడకశిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చలించిపోయారు. అప్పట్లో బాత్రూంలో ఉంటున్న నరసింహప్ప కుటుంబ దీన స్థితిని స్వయంగా చూశారు.
నరసింహప్ప ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఇంటి చూసి షాక్ అయ్యారు. అతనికి కొత్తగా ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా ఆ కుటుంబానికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అద్దె ఇంట్లో ఉండాలని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సూచించారు. 24 గంటల్లోనే నరసింహప్ప కుటుంబానికి గ్రామంలో రెండు సెంట్లు స్థలం మంజూరు చేయించారు. అంతటితో ఆగకుండా తన సొంత నిధులతో ఇల్లు నిర్మించి ఇస్తానని.. అప్పట్లో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం సరిగ్గా నాలుగు నెలల్లోనే నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు. దాదాపు ఆరు లక్షల వ్యయంతో ఒక హాల్, బెడ్ రూమ్, కిచెన్ తో కూడిన పక్కా గృహాన్ని కట్టించి.. నరసింహప్పకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఇంటి తాళాలు అందజేశారు. కొత్త ఇంట్లో పూజలు చేసి.. పాలు పొంగించి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు నిరుపేద నరసింహప్ప కుటుంబంతోపాటు గృహప్రవేశం చేశారు. బాత్రూంలో ఉంటున్న కుటుంబాన్ని.. పక్కా గృహం నిర్మించి సొంత ఇంట్లోకి చేర్చిన ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజును గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం బాత్రూంలో ఉంటున్న తమను.. సొంత ఇల్లు కట్టించి ఇచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుకు ధన్యవాదాలు చెబుతూ నరసింహప్ప కుటుంబం భావోద్వేగానికి లోనైంది. రాజకీయ నాయకులు అంటేనే హామీలు ఇచ్చి మరిచిపోయే ఈ రోజుల్లో… ఇచ్చిన మాట కోసం నాలుగు నెలల్లోనే సొంత డబ్బులతో.. బాత్రూంలో అత్యంత దుర్భర జీవితం గడుపుతున్న కుటుంబానికి.. పక్కా గృహం కట్టించి ఇచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గొప్ప మనస్సును ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.
వీడియో చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




