AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Machilipatnam: మచిలీపట్నంలో మెర్సీ కిల్లింగ్ కలకలం.. జంతు ప్రేమికుల ఆవేదన

మచిలీపట్నంలో వీధి కుక్కలను విషప్రయోగం చేసి చంపిన ఘటన తీవ్రంగా వివాదాస్పదమైంది. జంతు ప్రేమికులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రు. కుక్కలను చంపడం చట్టవిరుద్ధమని, వాటిని స్టెరిలైజ్‌ చేసి రేబీస్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం తప్ప మరే మార్గం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు.

Machilipatnam: మచిలీపట్నంలో మెర్సీ కిల్లింగ్ కలకలం.. జంతు ప్రేమికుల ఆవేదన
Machilipatnam
M Sivakumar
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 07, 2025 | 4:40 PM

Share

మచిలీపట్నంలో మూగజీవాలపై జరిగిన సంఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వీధి కుక్కలను మెర్సీ కిల్లింగ్ పేరుతో ఇంజెక్షన్ వేసి చంపేస్తున్నారని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బందరు బస్ స్టాండ్ సెంటర్ దగ్గర.. సజీవంగా తిరుగుతున్న కుక్కలను పట్టుకుని.. విషప్రయోగం చేసి చంపేశారు. చనిపోయిన కుక్కలను పారిశుద్ధ్య వాహనంలో ఎక్కిస్తూ ఉండగా.. వాహనాన్ని అడ్డుకుని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు…

ఇది ఏమి మానవత్వం… ఇలా చంపేస్తే సమస్య తీరిపోతుందా.. అని ప్రశ్నిస్తున్నారు జంతు ప్రేమికులు… స్ట్రీట్ డాగ్స్‌ని చంపడం చట్టవిరుద్ధమని.. సుప్రీంకోర్టు తీర్పులను కూడా గుర్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు 2015 నుంచి 2023 వరకూ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. వీధి కుక్కలను చంపకూడదని వాటిని స్టెరిలైజ్ చేసి… రేబీస్ వ్యాక్సిన్ వేసి…తిరిగి వాటి పరిసరాల్లోనే విడిచిపెట్టాలని చట్టం చెప్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని జీవం తీసే హక్కు ఎవరికీ లేదు..అవి అనారోగ్యంతో ఉన్నా కూడా…అధికారిక వెటర్నరీ సర్టిఫికేట్ లేకుండా యూటెనేసియా చేయడం నేరం. అయితే… మచిలీపట్నంలో ఈ నిబంధనలను నేరుగా ఉల్లంఘించారని జంతు ప్రేమికుల ఆరోపణ చేస్తున్నారు.

పన్నులు మాత్రం వసూలు చేస్తున్నారు…కానీ కుక్కలపై ABC ప్రోగ్రామ్ అమలు చేయడం లేదు.. అని మున్సిపాలిటీపై వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కుక్కలు ప్రమాదకరమయ్యాయనే పేరుతో చంపేస్తే…ఇది సమస్యకు పరిష్కారం కాదని… నిపుణులు చెప్తున్నారు.

ఒక ప్రాంతంలో కుక్కలను చంపేస్తే… మరొక ప్రాంతం నుంచి కొత్త కుక్కలు వచ్చి ఆ ఖాళీని భర్తీ చేస్తాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా… కిల్ కాదు… స్టెరిలైజ్ & వేక్సినేట్” అనే విధానం‌ను సూచించింది. ఈ ఘటనపై స్థానికుల అభిప్రాయాలు రెండు విధంగా ఉన్నాయి.

ఒక వర్గం మాత్రం పిల్లలపై దాడులు పెరిగాయి… రాత్రిళ్లు బయటికి వెళ్లడం భయం వేస్తుంది. ప్రమాదకరమైన కుక్కలను తొలగించాలి అని అంటున్నారు. మరో వర్గం మాత్రం అవును… భయం ఉంది. కానీ హింస కాదు పరిష్కారం…మున్సిపాలిటీ తన బాధ్యత చేయాలి. అంతేకానీ వాటిని చంపకూడదు అంటున్మనారు. నిషికి ఉన్నంత జీవించే హక్కు ఉన్నట్లే… మూగ జీవాలకు కూడా ఉంది. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

చనిపోయిన కుక్కలపై పోస్ట్‌మార్టం జరిగిందా? ఏ ఇంజెక్షన్ వేశారు? అది వెటర్నరీ సర్టిఫైడా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. కుక్కలను చంపిన వారిపై కేసులు నమోదు చేయాలని…వెంటనే ABC ప్రోగ్రామ్ అమలు చేయాలని… జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రతా ఆందోళన… జంతు సంరక్షణ చట్టాలు…రెండింటినీ సమంగా చూసే బాధ్యత ఇప్పుడు అధికారులపై ఉంది. మచిలీపట్నంలో జరిగిన ఈ ఘటన…ఇప్పుడు కేవలం ఒక నగరానికి చెందిన సమస్య కాదు. మానవత్వం vs మానవ హక్కులు అన్న పెద్ద చర్చగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.