AP Rains: మరో అల్పపీడనం టెన్షన్.. ఏపీకి రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..
ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో నవంబర్ 16వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో నవంబర్ 16వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని చెప్పింది. దీంతో రానున్న రెండు రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంద్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :- ————————————————————————————————————————–
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:– —————————————————————————————————————
ఈరోజు, రేపు, ఎల్లుండి:- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ———————————————————————————————–
ఈరోజు:– తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సంభవించవచ్చు.
రేపు:– తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి :- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.
రాయలసీమ :- ——————————————————————————–
ఈరోజు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .
రేపు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి :- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది .
కాగా, రానున్న రెండు రోజుల్లో చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్రంలో అలల ఉధృతి నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.