నడిరోడ్డుపై ఓ పెద్ద గుంత.. ఏముందో తెలుసుకునేందుకు అలా చేసిన స్థానికులు..

ప్రకాశంజిల్లాలో నడిరోడ్డుపై ఏర్పడిన ఓ పెద్ద గుంత ఆసక్తిగా మారింది. సాధారణంగా పూర్వ కాలంలో నిధి నిక్షేపాలను భూమిలోపల దాచుకుంటారని విన్నాం. కొన్ని చోట్ల చూశాం. అటువంటి మన పరిసర ప్రాంతాలలో భూమి లోపల నిక్షేపాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఆసక్తి, ఉత్సాహం చూపిస్తూ ఉంటారు కొందరు. కొన్ని ప్రాంతాలలో అలాంటివి అరుదుగా కనిపిస్తుంటాయి. మరికొన్ని ప్రాంతాలలో మన పూర్వీకులు విలువైన వస్తువులు, ధాన్యం, ఆహార పదార్ధాలు భద్రపరుచుకునేందుకు కొన్ని గుంతలను తీస్తూ ఉంటారు.

నడిరోడ్డుపై ఓ పెద్ద గుంత.. ఏముందో తెలుసుకునేందుకు అలా చేసిన స్థానికులు..
Prakasham District
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 19, 2024 | 8:38 PM

ప్రకాశంజిల్లాలో నడిరోడ్డుపై ఏర్పడిన ఓ పెద్ద గుంత ఆసక్తిగా మారింది. సాధారణంగా పూర్వ కాలంలో నిధి నిక్షేపాలను భూమిలోపల దాచుకుంటారని విన్నాం. కొన్ని చోట్ల చూశాం. అటువంటి మన పరిసర ప్రాంతాలలో భూమి లోపల నిక్షేపాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఆసక్తి, ఉత్సాహం చూపిస్తూ ఉంటారు కొందరు. కొన్ని ప్రాంతాలలో అలాంటివి అరుదుగా కనిపిస్తుంటాయి. మరికొన్ని ప్రాంతాలలో మన పూర్వీకులు విలువైన వస్తువులు, ధాన్యం, ఆహార పదార్ధాలు భద్రపరుచుకునేందుకు కొన్ని గుంతలను తీస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటాయి. వాటికి సంబంధించిన ఒ ఘటనే తాజాగా ప్రకాశంజిల్లాలో వెలుగు చూసింది. రోడ్డుపై ఏర్పడిన గుంతపై ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బోగోలు గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంత ఆ ప్రాంతంలో ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది. గ్రామ ప్రజలే కాదు, ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఆ గుంతలో ఏముందని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బోగోలు గ్రామ సమీపంలో ఓ చిన్న గుంత ఏర్పడింది. ఆ మార్గంలో నిరంతరం వాహనాలు తిరుగుతూ ఉంటాయి. దీంతో ఆ గుంత మరింత పెద్దగా మారింది. కొద్దిరోజుల తర్వాత ఆ ప్రాంతంలో రంధ్రం ఏర్పడింది. అటువైపు నుంచి ప్రయాణిస్తున్న వాహనదారులు రోడ్డుపై ఏర్పాడిన గుంతను వింతగా చూశారు. అసలు ఏముంది అని లోపల చూడగా స్థానిక ప్రజలు వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదో విలువైన వస్తువులను దాచి పెట్టేందుకు ఎవరో ఇక్కడ గుంత తవ్వినట్టుగా.. ఒక గది ఏర్పరిచినట్టు కనిపించింది. దీంతో స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. చూడటానికి గుప్తనిధులను లేదా ఏదైనా విలువైన వస్తువులను దాచి పెట్టేందుకు తవ్వినట్టుగా ఉన్న ఆ గుంతతో ఓ గది ఉండటాన్ని ప్రజలు ఆశక్తిగా చూస్తున్నారు. స్థానికులు సంబంధిత అధికారులకు ఈ గుంతపై సమాచారాన్ని అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు గుంతను పరిశీలించి అందులో ఏమీ లేదని నిర్ధారించుకుని వెనుతిరిగారు. అయితే ప్రస్తుతం రోడ్డుపై ఏర్పడిన ఈ గుంత స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కొత్తిల్లు కడుతున్నారా.? ఈ బేసిక్‌ వాస్తు నియమాలు పాటించండి..
కొత్తిల్లు కడుతున్నారా.? ఈ బేసిక్‌ వాస్తు నియమాలు పాటించండి..
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వర్ష బీభత్సం.. కారులో విమానాశ్రయానికి వస్తూ తండ్రీకూతురు..
వర్ష బీభత్సం.. కారులో విమానాశ్రయానికి వస్తూ తండ్రీకూతురు..
బాలకృష్ణకు అభినందనలు తెలిపిన రజినీకాంత్..
బాలకృష్ణకు అభినందనలు తెలిపిన రజినీకాంత్..
దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్‌‌.. 4 ఓవర్లతో చెత్త రికార్..
దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్‌‌.. 4 ఓవర్లతో చెత్త రికార్..
వాగులో చిక్కుకున్న బస్సు.. 10 గంటలుగా ప్రయాణికుల అవస్థలు
వాగులో చిక్కుకున్న బస్సు.. 10 గంటలుగా ప్రయాణికుల అవస్థలు
వర్షం వల్ల ఇంట్లో గోడలకు తేమ వస్తుందా.? ఇలా చేయండి..
వర్షం వల్ల ఇంట్లో గోడలకు తేమ వస్తుందా.? ఇలా చేయండి..
వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ మహిళల పూజలు
వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ మహిళల పూజలు
చల్లటి వెదర్‌లో హాట్‌హాట్‌ చిల్లీ చికెన్‌.. ఇంట్లోనే రెస్టారెంట్
చల్లటి వెదర్‌లో హాట్‌హాట్‌ చిల్లీ చికెన్‌.. ఇంట్లోనే రెస్టారెంట్
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ మహిళల పూజలు
వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ మహిళల పూజలు
బాబోయ్‌..హైదరాబాద్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం..
బాబోయ్‌..హైదరాబాద్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం..
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..