Andhra Pradesh: నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పడ్డ పిడుగు.. విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచన

ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో పిడుగుల టెన్షన్ ఎక్కువైంది. పిడుగుపాటుకు పలువురు మృతి చెందారు కూడా. రోజూ ఏదో ఒక ప్రాంతంలో పిడుగులు పడుతూనే ఉన్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది.

Andhra Pradesh: నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పడ్డ పిడుగు.. విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచన
Lightning Strike
Follow us

|

Updated on: Apr 29, 2023 | 9:01 PM

మహారాష్ట్రలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ కార్మికుడిపై పిడుగు పడింది. దాంతో అతను స్పాట్‌లో కుప్పకూలిపోయాడు. ఈ మాటలకందని విషాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే బహిరంగ ప్రదేశాల్లో ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళలేకుంటే చెప్పులు ధరించి చెవులు మూసుకుని కింద మోకాలిపై కూర్చోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. అందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దాన్ని దిగువన చూడండి. దయచేసి.. ఈ సమాచారాన్ని ఇతరులకు పాస్ చేయండి. మీరు ఓ ప్రాణాన్ని నిలబెట్టినవారు అవుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో అకాల వర్షాలు ఎలా కురుస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. చాలా ప్రాంతాల్లో పిడుగులు పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు అవసరం.

పిడుగుపాటుకు గురవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి
  • సముద్రం, చెరువులు, కొలనులు, కాలవల వద్ద ఉంటే వెంటనే దూరంగా వెళ్లాలి. రేకు, లోహం కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలి
  • ఉరుముల శబ్ధం వినపడ్డ వెంతనే పొలాల్లోని రైతులు, రైతు కూలీలు, జీవాల కాపర్లు, బయట ప్రాంతాల్లో పనిచేసేవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి
  • కారు, బస్సుల లోపల ఉంటే.. అన్ని డోర్లు మూసి వేయాలి
  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు.. మీ మెడ వెనుక జుట్టు నిక్కబొడుచుకోవడం లేదా చర్మం జలదరింపు ఉంటే… మెరుపు లేదా పిడుగు రావడానికి సూచనగా భావించండి
  • ఇంట్లో ఉంటే కిటికీలు, తలుపులు మూసెయ్యండి. ఉరుములు శబ్దం ఆగాక కూడా 30 నిమిషాలు ఇంట్లోనే ఉండండి
  • పిడుగు బాధితులను తాకితే ఏమీ కాదు. ఎవరైనా పిడుగు పాటుకు గురైతే సత్వరమే సాయం చెయ్యండి

పిడుగుపాటు సమయంలో చేయకూడనివి

  • పిడుగుపాటు సమయంలో చెట్ల కింద, టవర్ల వద్ద, చెరువుల వద్ద ఉండకూడదు
  • మొబైల్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించకూడదు
  • పిడుగుల సమయంలో స్నానం చేయడం, నీటిలో ఉండటం, చేతులు కడగడం లాంటివి చేయకూడదు
  • మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు, ఇతర ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి
  • వాహనములో ఉంటే లోహపు భాగాలను తాకకూడదు

మరిన్ని ఏపీ వార్తలు  కోసం క్లిక్ చేయండి..