శ్రీశైలం, మహానంది ఆలయాల చుట్టూ సంచరిస్తున్న చిరుతపులులు.. భయం గుప్పెట భక్తులు..!

నంద్యాల జిల్లాలో అలయ పరిసరాల్లో చిరుతపులి భయపెడుతోంది. ఇటీవల మహానంది ఆలయ సమీపంలోని గోశాల వద్ద చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 20 రోజులుగా మహానంది ఆలయ పరిసరాల్లో చిరుత సంచరించింది. తాజాగా పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశెలం ఆలయ పరిసరాల్లో చిరుత హాల్‌చల్ చేసింది

శ్రీశైలం, మహానంది ఆలయాల చుట్టూ సంచరిస్తున్న చిరుతపులులు.. భయం గుప్పెట భక్తులు..!
Leopard Hunting Dog
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 11, 2024 | 6:37 PM

అడవుల్లో ఉండాల్సిన వన్య మృగాలు.. తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. జీవాలు, మనుషులపై దాడులు చేస్తున్న ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మొన్న మహానంది.. ఇవాళ శ్రీశైలం.. ఇలా ఇటీవల రోజుకో చోట చిరుతల దర్శనంతో భక్తులు హడలెత్తి పోతున్నారు.

నంద్యాల జిల్లాలో అలయ పరిసరాల్లో చిరుతపులి భయపెడుతోంది. ఇటీవల మహానంది ఆలయ సమీపంలోని గోశాల వద్ద చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 20 రోజులుగా మహానంది ఆలయ పరిసరాల్లో చిరుత సంచరించింది. తాజాగా పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశెలం ఆలయ పరిసరాల్లో చిరుత హాల్‌చల్ చేసింది. చిరుత సంచారంతో భక్తులు, స్థానికులు, ఆలయ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.

శ్రీశైలం టోల్ గేట్ వద్ద అర్ధరాత్రి చిరుతపులి కలకలం సృష్టించింది. ఆహారం వెతుక్కుంటూ టోల్‌గేట్ పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి జనారణ్యంలోకి వచ్చింది. టోల్‌గేట్ వద్ద పడుకుని ఉన్న కుక్కను మాటు వేసి వేటాడింది. గోడ చాటున నక్కిన చిరుతపులి గోడపై నుంచి ఒక్కసారిగా దూకి కుక్క మెడ పట్టుకుని లాక్కెళ్లింది. ఇది గమనించిన శ్రీశైలం వస్తున్న యాత్రికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు చిరుతపులి దాడికి సంబంధించిన వీడియోను చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుతపులి సంచరించే ప్రదేశాలలో పరిశీలించారు. రాత్రుల సమయంలో స్దానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

నంద్యాల జిల్లా మహానంది ఆలయాన్ని చిరుత వదలట్లేదు. గత ఇరువై రోజులుగా ఆలయం దగ్గరే తిష్టవేయడంతో భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. ఆలయానికి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. మరోవైపు స్థానికులు సైతం భయబ్రాంతులకు గురవుతున్నారు. పొలాలకు కూడా వెళ్లలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చిరుతను బంధించాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. ఇటు సీసీ కెమెరాలో రికార్డైన చిరుత దృశ్యాలు వణకు పుట్టిస్తున్నారు.

వీడియో … 

ఇక తెలంగాణలో కూడా చిరుతలు హడలెత్తిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో చిరుత కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన మేకలను తీసుకుని మేత కోసం గుట్ట ప్రాంతంలో వెళ్లాడు. అకస్మాత్తుగా ఓ చిరుత వచ్చి మేకల మందపై దాడి చేసింది. మేకల కాపరులు అప్రమత్తం కావడంతో చిరుత పారిపోయింది. ఇక మెదక్‌ జిల్లా హవేలిఘన్‌పూర్ మండలంలో చిరుతపులి హల్చల్ చేసింది. నాగపూర్ గేటు పరిసరాల్లో చిరుత సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్